Site icon NTV Telugu

Little Hearts: కాత్యాయని.. కుమ్మేస్తున్నారంతే!

Little Hearts, Little Hearts Collections, Mouli Tanuj Prasanth, Shivani Nagaram, Sai Marthand

Little Hearts, Little Hearts Collections, Mouli Tanuj Prasanth, Shivani Nagaram, Sai Marthand

చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయం దిశగా దూసుకుపోతోంది ‘లిటిల్ హార్ట్స్’ మూవీ. ప్రమోషన్స్‌తోనే ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన చిత్ర యూనిట్.. కంటెంట్‌తోను అదరగొట్టారు. దీంతో.. భారీ వసూళ్లను రాబడుతోంది లిటిల్ హార్ట్స్. అలాగే.. కాత్యాయని అంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న హంగామా అంతా ఇంతా కాదు. అసలు.. ఈ సినిమా టైటిల్ లిటిల్ హార్ట్స్ కానీ, కలెక్షన్స్ మాత్రం అస్సలు కానే కాదు. అలాగే.. ఈ మధ్య కాలంలో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసిన విషయంలో ఇది పెద్ద సినిమా అనే చెప్పాలి.‌ #90s ఫేమ్ మౌళి లీడ్ రోల్‌లో, శివాని నాగరం హీరోయిన్‌గా తెరకెక్కిన ఈ రొమాంటిక్ కామెడీ చిత్రాన్ని సాయి మార్తాండ్ డైరెక్ట్ చేశాడు. యూత్‌ని టార్గెట్ చేస్తూ వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్ దక్కుతోంది. దీంతో.. భారీ వసూళ్లు రాబడుతోంది.

Also Read: Peddi: ఫస్ట్ సింగిల్ రెడీ.. ఆరోజేనా!?

దాదాపు 2 కోట్లకు అటు ఇటు బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా మూడు రోజుల్లో ఏకంగా 12 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. మొదటి రోజు కంటే రెండో రోజు, రెండో రోజు కంటే మూడో రోజు.. వసూళ్లు పెరుగుతునే వచ్చాయి. మొదటి‌ రోజు 2.54 కోట్లు ఓపెనింగ్స్ రాబట్టగా.. సెకండ్ డే 4.25 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక థర్డ్ డే సండే నాడు 5.42 కోట్లు రాబట్టింది. మొత్తంగా.. ఫస్ట్ వీకెండ్‌లో 12.21 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఈ సినిమాకు పెట్టిన బడ్జెట్‌కు, జరిగిన బిజినెస్‌కు ఆరింతలు కలెక్ట్ చేసి.. మేకర్స్‌కు భారీ లాభాలు ఇచ్చేలా లిటిల్ హార్ట్స్ దూసుకుపోతోంది. ఇక ఈ సినిమాలో కాత్యాయని నన్ను లవ్ చేయవే.. అంటూ హీరో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. అందుకు సంబంధించిన సాంగ్ సోషల్ మీడియాను ఊపేస్తోంది. మొత్తంగా.. లిటిల్ హార్ట్స్ కలెక్షన్స్ మాత్రం ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.

Exit mobile version