Site icon NTV Telugu

Little Hearts : దుమ్ము లేపిన లిటిల్ హార్ట్స్.. మరో రికార్డు

Little Hearts Review

Little Hearts Review

Little Hearts : చిన్న సినిమాగా వచ్చి సంచలన విజయం సాధించిన చిత్రం ‘ లిటిల్ హార్ట్స్ ‘. ఈ చిత్రం యువతను కట్టిపారేసింది. బోసిపోయిన బాక్సాఫీస్ కు ఊపిరి పోసింది. కంటెంట్ ఉంటే మంచి సినిమాని ఆదరించడానికి ప్రేక్షకులు ఎప్పుడూ రెడీగా ఉంటారనే విషయాన్ని మరోసారి స్పష్టం చేసింది. మౌళి తనూజ్, శివానీ నాగరం హీరో హీరోయిన్లుగా ‘లిటిల్ హార్ట్స్’ చిత్రం తెరకెక్కింది. ఈటీవీ విన్‌ ఒరిజినల్‌ ప్రొడక్షన్‌లో సాయి మార్తాండ్‌ తెరకెక్కించిన సినిమా థియేటర్లలో మంచి కలెక్షన్స్ రాబట్టింది. సెప్టెంబర్ 5వ తేదీన థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల ఆదరణ పొందిన ఈ సినిమా తాజాగా ఓటీటీలోనూ రికార్డును సొంతం చేసుకుంది. ఈటీవీ విన్‌లో 100మిలియన్‌ స్ట్రీమింగ్‌ మినిట్స్‌ దాటి అత్యధికంగా వీక్షించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఈ అంశంపై సంతోషం వ్యక్తం చేసిన చిత్ర బృందం.. తమకు ఆదరణ అందిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపింది.

Read Also : War 2 : నా చేతుల్లో లేదు.. వార్-2 డిజాస్టర్ పై హృతిక్ పోస్ట్

లిటిల్ హార్ట్స్ సినిమా కొనుగోలు చేసిన ప్రతి ఒక్క బయ్యర్ కి కాసుల వర్షం కురిసిందనే చెప్పాలి. అంతలా ఈ సినిమా కలెక్షన్స్ రాబట్టింది. తాజాగా ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చింది. ఈ సినిమాను నిర్మించిన ఈటీవీ విన్ ఇటీవల ఈ సినిమాను తమ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్‌కు తీసుకువచ్చింది. అక్టోబర్ ఒకటి నుంచి స్ట్రీమింగ్ మొదలైంది. థియేటర్ లో రిలీజ్ చేసిన వర్షన్ కాకుండా ఎడిటింగ్ లో కట్ చేసిన ఒరిజినల్ వర్షన్ ను స్ట్రీమింగ్ చేస్తోంది. థియేటర్ లో సూపర్ హిట్ అయిన ఈ చిన్న సినిమా ఓటీటీలోనూ దుమ్మురేపుతోంది.

Read Also : Radhika Apte: “నీకు దురద పెడితే నేను గోకి పెడతాను” –స్టార్ హీరో బండారం బయట పెట్టిన రాధిక

Exit mobile version