Tollywood : టాలీవుడ్ స్టార్ హీరోల లైనప్.. ఎవరెవరి చేతిలో ఎన్ని సినిమాలు ఉన్నాయంటే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియన్ సినిమా మార్కెట్ లో టాలీవుడ్ హీరోలు చేస్తున్న సినిమాలు మరే ఇతర స్టార్స్ చేయడం లేదు. సొంత భాష దర్శకులనే కాదు పర భాష ఇండస్ట్రీ డైరెక్టర్స్ ను కూడా లైన్ లో పెడుతూ పాన్ ఇండియా మార్కెట్ పై జెండా ఎగరేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం మన టాలీవుడ్ హీరోల చేతిలో నాలుగైదు సినిమాలు ఉన్నాయి. ఎవరెవరి లైనప్ ఎలా ఉందొ ఓ సారి పరిశీలిస్తే..
ప్రభాస్ : రాబోయే 5 నుండి 6 సంవత్సరాలు రెబల్ స్టార్ షెడ్యూల్ ఫిక్స్ అయింది. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న సినిమాలు మరే ఇతర హీరోలు చేయడం లేదు. ప్రస్తుతం చేస్తున్న రాజాసాబ్ జనవరి 9న వస్తుంది. దానితో పాటు ఫౌజీ, స్పిరిట్, చేస్తున్నాడు. సలార్ 2, కల్కి 2 ఎలాగూ ఉండనే ఉన్నాయి. ప్రశాంత్ వర్మతో కూడా ఒక సినిమా చేయాల్సి ఉంది.
Also Read
జూనియర్ NTR : ప్రస్తుతం ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో డ్రాగన్ చేస్తున్నాడు. వచ్చే ఏడాది మిడ్ లో ఈ సినిమాను ఫినిష్ చేసి నెక్ట్స్ త్రివిక్రమ్ లో ‘గాడ్ ఆఫ్ వార్’ సెట్స్ పైకి తీసుకువెళ్ళనున్నాడు. ఇక ఆ తర్వాత తమిళ దర్శకుడు నెల్సన్ ప్రాజెక్ట్ కూడా ఉంది. అన్ని కుదిరితే దేవర సీక్వెల్ కూడా ఉండొచ్చు.
రామ్‌చరణ్ : గేమ్ చెంజర్ రిజల్ట్ తో చరణ్ కథల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఉప్పెన దర్శకుడు బుచ్చి బాబు డైరెక్షన్ లో చేస్తున్న పెద్దితో పాటు సుకుమార్‌తో RC17 కూడా లైన్ లో పెట్టాడు.
మహేశ్ బాబు : రాజమౌళి డైరెక్షన్ లో వారణాసి మాత్రమే చేస్తున్నాడు. ఈ సినిమా కోసం 2027 వరకు డేట్స్ ఇచ్చేసాడు మహేశ్
అల్లుఅర్జున్ : అట్లీ డైరెక్షన్ లో AA22 చేస్తున్నాడు, మలయాళ దర్శకుడు బాసిల్ జోసెఫ్‌తో అలాగే తమిళ్ దర్శకుడు లోకేష్ కనకరాజ్ తో చర్చలు కొనసాగుతున్నాయి కానీ ఇంకా ఏమీ లాక్ కాలేదు.
పవన్ కళ్యాణ్ : ఉస్తాద్ భగత్ సింగ్ ఫినిష్ చేశాడు. OG 2తో పాటు రామ్ తల్లూరి & KVNప్రొడక్షన్ లో సినిమాలు ఉన్నాయి.
Also Read : Tollywood : ‘స్టార్ పవర్ కాదు స్టోరీ యే పవర్’ అని నిరూపించిన చిన్న సినిమాలు
తాజావార్తలు
-
AP Model Code of Conduct: ఏపీలో అమల్లోకి ఎన్నికల కోడ్.. కొత్త పథకాలు, ప్రాజెక్టులకు బ్రేక్.. నిబంధనలు ఇవే..
-
Israel: ఇజ్రాయిల్ వెళ్లే విమానాల్లో పాక్ పైలట్లు, సిబ్బందిపై నిషేధం..!
-
DRDO QKD test: DRDO కీలక విజయం.. క్వాంటం టెక్నాలజీతో రక్షణ సమాచారానికి మరింత భద్రత!
-
AP Local Body Election Schedule 2026: ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.. పూర్తి షెడ్యూల్ ఇదే..
-
Yash: చేసిన తప్పునే మళ్ళీ మళ్ళీ చేస్తున్న యష్?
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..