Site icon NTV Telugu

Liger Trailer : అల‌రిస్తోన్న క్రాస్ బ్రీడ్ `లైగ‌ర్` ట్రైల‌ర్!

Liger Trailer Out

Liger Trailer Out

Liger Trailer out :

 

డైన‌మిక్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ అండ్ ఎన‌ర్జిటిక్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన `లైగ‌ర్` చిత్రం ట్రైల‌ర్ గురువారం (జూలై 21న‌) జ‌నం ముందు నిల‌చింది. అనన్య పాండే నాయిక‌గా న‌టించిన ఈ చిత్రంలో ర‌మ్య‌కృష్ణ‌, ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత బాక్స‌ర్ మైక్ టైస‌న్ కీలక పాత్ర‌లు పోషించారు. ఈ మూవీ ఆగ‌స్టు 25న జ‌నం ముందు నిలువ‌నుంది. `లైగ‌ర్` ట్రైల‌ర్ అలా వ‌చ్చీ రాగానే ల‌క్ష‌ల వ్యూస్ తో దూసుకుపోతోంది.

ఇంత‌కూ `లైగ‌ర్` ట్రైల‌ర్ లో అంత‌గా ఆక‌ట్టుకొనే అంశాలు ఏమున్నాయి? “ఒక ల‌య‌న్ కి టైగ‌ర్ కి పుట్టిండాడు… క్రాస్ బ్రీడ్ సార్ … నా బిడ్డ‌…“ అంటూ ర‌మ్య‌కృష్ణ పాత్ర చెప్పే మాట‌ల‌తో `లైగ‌ర్` ట్రైల‌ర్ మొద‌ల‌వుతుంది. టైటిల్ సాంగ్ – “అందుకే అంటుంటారు న‌న్ను లైగ‌ర్…“ అని సాగే పాట నేప‌థ్యంలో `లైగర్`లోని ఫైట్ విజువ‌ల్స్ క‌నిపిస్తాయి. వాటిలోనే అన‌న్య పాండే అంద‌మైన చూపులు కుర్ర‌కారును గిలిగింత‌లు పెట్టేలా ఉన్నాయి. హీరో విజ‌య్ దేవ‌ర కొండ‌, అనన్య పాండే మ‌ధ్య కెమిస్ట్రీ సైతం యువ‌త‌ను ఆక‌ట్టుకొనేలా ఉంది. ఓ సీన్ లో ర‌మ్య‌కృష్ణ ఎగిరి కాలితో హీరోను కొట్టే సీన్ ఆశ్చ‌ర్యం క‌లిగిస్తుంది. ఓ సీన్ లో హీరో కేరెక్ట‌ర్ `ల‌వ్` అనే ప‌దాన్ని న‌త్తిలాగా చెప్ప‌డ‌మూ క‌నిపిస్తుంది. ఇందులో హీరో కేరెక్ట‌ర్ కు న‌త్తి ఉన్న‌ట్టు చూపించ‌డంలోని లోగుట్టు ఏంటో కూడా అర్థం కాక ఆస‌క్తిని పెంచుతుంది. ర‌మ్య‌కృష్ణ `రౌడీ రంగ‌మ్మ‌`లా కొన్ని సీన్స్ లో ఫెరోషియ‌స్ గానూ ఉన్నారు. హీరోయిన్ “స్టే అవే ఫ్ర‌మ్ మై లైఫ్…“ అంటూ చెప్ప‌డ‌మూ ఇందులో చోటు చేసుకుంది. వెస్ట్ర‌న్ గెట‌ప్ లో ప్ర‌ఖ్యాత బాక్స‌ర్ టైస‌న్ ద‌ర్శ‌న‌మిస్తారు. “ఇఫ్ యూ ఎ ఫైట‌ర్ విన్న‌మై…“ అంటూ టైస‌న్ క‌రిబియ‌న్ యాక్సెంట్ లో చెప్ప‌డ‌మూ ఉంది. చూడ‌బోతే గ‌తంలో పూరి జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కించిన `అమ్మ నాన్న ఓ త‌మిళ‌మ్మాయి`కి మ‌రో వ‌ర్ష‌న్ లా `లైగ‌ర్` క‌నిపిస్తోంది. చాలా రోజుల నుంచీ ఊరిస్తోన్న పూరి జ‌గ‌న్నాథ్ `లైగ‌ర్` పై యూత్ లో అంచ‌నాలు బాగానే ఉన్నాయి. వాటిని పెంచేలాగే `లైగ‌ర్` ట్రైల‌ర్ ను క‌ట్ చేయ‌డ‌మూ ఆక‌ట్టుకుంటుంది. మ‌రి సినిమా ఏ తీరున మురిపిస్తుందో చూడాలి.

Exit mobile version