Liger Trailer : అలరిస్తోన్న క్రాస్ బ్రీడ్ `లైగర్` ట్రైలర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Liger Trailer out :
Also Read
- Kayadu Lohar: ‘ది ప్యారడైజ్’లో కాయదు విలనా.. హీరోయినా? నాని మైండ్ బ్లాంక్ రియాక్షన్!
- The Paradise : ‘ది ప్యారడైజ్’ సీక్రెట్స్ లీక్ చేసిన సంపూర్ణేష్ బాబు! నాని జడల వెనుక అసలు కథ ఇదేనట..
- Sampoornesh Babu: స్టార్డమ్ ముసుగు తీసేసిన సంపూ.. తెరవెనుక అసలైన జీవితం ఇదేనట!
- Viswanath & Sons : నెట్‌ఫ్లిక్స్‌ను ఊపేస్తున్న సూర్య సినిమా.. ఇండియాలో నెం.1.. గ్లోబల్‌గా టాప్-3!
డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో విజయ్ దేవరకొండ నటించిన `లైగర్` చిత్రం ట్రైలర్ గురువారం (జూలై 21న) జనం ముందు నిలచింది. అనన్య పాండే నాయికగా నటించిన ఈ చిత్రంలో రమ్యకృష్ణ, ప్రపంచ ప్రఖ్యాత బాక్సర్ మైక్ టైసన్ కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీ ఆగస్టు 25న జనం ముందు నిలువనుంది. `లైగర్` ట్రైలర్ అలా వచ్చీ రాగానే లక్షల వ్యూస్ తో దూసుకుపోతోంది.
ఇంతకూ `లైగర్` ట్రైలర్ లో అంతగా ఆకట్టుకొనే అంశాలు ఏమున్నాయి? “ఒక లయన్ కి టైగర్ కి పుట్టిండాడు… క్రాస్ బ్రీడ్ సార్ … నా బిడ్డ…“ అంటూ రమ్యకృష్ణ పాత్ర చెప్పే మాటలతో `లైగర్` ట్రైలర్ మొదలవుతుంది. టైటిల్ సాంగ్ – “అందుకే అంటుంటారు నన్ను లైగర్…“ అని సాగే పాట నేపథ్యంలో `లైగర్`లోని ఫైట్ విజువల్స్ కనిపిస్తాయి. వాటిలోనే అనన్య పాండే అందమైన చూపులు కుర్రకారును గిలిగింతలు పెట్టేలా ఉన్నాయి. హీరో విజయ్ దేవర కొండ, అనన్య పాండే మధ్య కెమిస్ట్రీ సైతం యువతను ఆకట్టుకొనేలా ఉంది. ఓ సీన్ లో రమ్యకృష్ణ ఎగిరి కాలితో హీరోను కొట్టే సీన్ ఆశ్చర్యం కలిగిస్తుంది. ఓ సీన్ లో హీరో కేరెక్టర్ `లవ్` అనే పదాన్ని నత్తిలాగా చెప్పడమూ కనిపిస్తుంది. ఇందులో హీరో కేరెక్టర్ కు నత్తి ఉన్నట్టు చూపించడంలోని లోగుట్టు ఏంటో కూడా అర్థం కాక ఆసక్తిని పెంచుతుంది. రమ్యకృష్ణ `రౌడీ రంగమ్మ`లా కొన్ని సీన్స్ లో ఫెరోషియస్ గానూ ఉన్నారు. హీరోయిన్ “స్టే అవే ఫ్రమ్ మై లైఫ్…“ అంటూ చెప్పడమూ ఇందులో చోటు చేసుకుంది. వెస్ట్రన్ గెటప్ లో ప్రఖ్యాత బాక్సర్ టైసన్ దర్శనమిస్తారు. “ఇఫ్ యూ ఎ ఫైటర్ విన్నమై…“ అంటూ టైసన్ కరిబియన్ యాక్సెంట్ లో చెప్పడమూ ఉంది. చూడబోతే గతంలో పూరి జగన్నాథ్ తెరకెక్కించిన `అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి`కి మరో వర్షన్ లా `లైగర్` కనిపిస్తోంది. చాలా రోజుల నుంచీ ఊరిస్తోన్న పూరి జగన్నాథ్ `లైగర్` పై యూత్ లో అంచనాలు బాగానే ఉన్నాయి. వాటిని పెంచేలాగే `లైగర్` ట్రైలర్ ను కట్ చేయడమూ ఆకట్టుకుంటుంది. మరి సినిమా ఏ తీరున మురిపిస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
OTR: వచ్చే ఎన్నికల్లో తిరుపతి ఎంపీ టిక్కెట్ కోసం ఇప్పట్నుంచే పనబాక ప్లాన్!
-
OTR: ధర్మవరం వైసీపీ నేతలకు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వార్నింగ్
-
Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
-
OTR: ఏపీలో పదే పదే రిక్రూట్మెంట్ జీవోల విషయంలో తడబాట్లు..
-
Air India Kanishka Bombing: ఎయిర్ ఇండియా కనిష్క పేలుడు.. 41 ఏళ్ల తర్వాత కేసు మూసివేత దిశగా కెనడా?
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..