Site icon NTV Telugu

Puri Jagannadh Team:  ‘సాహో’ బాటలో ‘లైగర్’!?

Liger

Liger

Puri Jagannadh Team:

పూరి టీమ్ ‘లైగర్’ ప్రచారంలో వేగం పెంచింది. విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా పూరి తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా సినిమా ‘లైగర్’ ప్రపంచ వ్యాప్తంగా ఆగస్ట్ 25 రిలీజ్ కి సిద్దం అవుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ‘లైగర్ హంట్ థీమ్’ తో పాటు ‘అకిడి పక్డి’ పాటలు రిలీజ్ అయ్యాయి. ఈ సినిమాతో బాలీవుడ్‌లో జెండా పాతాలని డిసైడ్ అయ్యారు డాషింగ్ డైరెక్టర్ పూరి, హీరో విజయ్ దేవరకొండ. అందుకేనేమో ఈ మూవీ కోసం బాలీవుడ్ టెక్నిక్‌ ఫాలో అవుతున్నారు. నిజానికి సినిమా స్టార్టింగ్ లో కంపోజర్ సునీల్ కశ్యప్ పాటలు, మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తారని భావించారు. పాట రిలీజ్ అయిన తర్వాత టోటల్ గా ఛేంజ్ అయిపోయినట్లు తెలుస్తోంది. ‘అక్డి పక్డీ’ కి మిలియన్స్ వ్యూస్ వచ్చాయి. ఈ పాటకు సునీల్ కశ్యప్ హుక్ లైన్ ఇవ్వగా… లిజో జార్జ్, డిజె చేతస్ కంపోజ్ చేశారు. లిజో గతంలో ‘గుడ్ న్యూస్’లో ‘సౌదా ఖరా ఖరా’, ‘సింబా’లో ‘మేరా వాలా డాన్స్’ వంటి హిట్ పాటలను కంపోజ్ చేసి ఉన్నాడు. ఇక ‘లైగర్’లో ఇతర పాటలను విక్రమ్ మాంట్రోస్, తనిష్క్ బాగ్చీ కంపోజ్ చేయనున్నారు. గతంలో ప్రభాస్ ‘సాహో’ సినిమాలో పాటలను తనిష్క్ బాగ్చీ, బాద్‌షా, శంకర్ ఎహసాన్ లాయ్ వంటి విభిన్న స్వరకర్తలు కంపోజ్ చేయగా జిబ్రాన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించారు. బాలీవుడ్‌లో కొంతకాలంగా కొనసాగుతున్న సూపర్ హిట్ టెక్నిక్ ఇది. కానీ బాలీవుడ్‌లో వర్క్‌ అవుట్ అయిన ఈ టెక్నిక్ టాలీవుడ్‌లో మాత్రం సక్సెస్ కాలేదు. ‘సాహో’ తెలుగునాట ప్లాఫ్ అయింది. మరి ‘సాహో’ బాటలో వెళుతున్న ‘లైగర్’ ఆ సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తాడా? లేక అదే బాటలో పయనిస్తాడా? అన్నది చూడాలి.

Exit mobile version