NTV Telugu Site icon

“లైగర్” అప్డేట్… బీటీఎస్ పిక్స్ వైరల్

Liger

ముందుగా ప్రకటించినట్లుగానే సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ తన నెక్స్ట్ మూవీ అప్డేట్స్ తో మ్యాజిక్ చేయడానికి సిద్ధమయ్యాడు. తాజాగా పాన్ ఇండియన్ స్పోర్ట్స్ డ్రామా “లైగర్” నుంచి బీటీఎస్ పిక్స్ రిలీజ్ చేశారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో ఈరోజు ఉదయం చిత్రనిర్మాతలలో ఒకరైన కరణ్ జోహార్ ఈ బీటీఎస్ పిక్స్ ను విడుదల చేశారు. కెమెరాలో విజయ్ దేవరకొండ చూడడం ఒక పిక్ లో ఉంటే, మరి పిక్ లో తెర వెనుక విజయ్ దర్శకుడు పూరీ జగన్నాధ్‌తో సన్నివేశాల గురించి చర్చిస్తున్నట్లు ఫోటోలు చూస్తుంటే అర్థమవుతోంది. ఇక రేపు ఉదయం సినిమా నుంచి ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేయబోతున్నారు.

‘లైగర్’ నుంచి ఈరోజు ఉదయం విడుదలైన బీటీఎస్ స్టిల్స్ రౌడీ ఫ్యాన్స్ ను ఉత్సాహపరుస్తుండగా, ప్రత్యేక ఇన్స్టా ఫిల్టర్ సాయంత్రం 4 గంటలకు ఆవిష్కరిస్తారు. ఈ సంవత్సరం చివరి రోజున ఫస్ట్ గ్లింప్స్ విడుదల అవుతుంది. కాబట్టి టీమ్ ‘లైగర్’ నుండి బ్యాక్ టు బ్యాక్ ట్రీట్‌ల కోసం సిద్ధంగా ఉండండి.

పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించిన ‘లైగర్’ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా. విజయ్ దేవరకొండ, అనన్య పాండే, మైక్ టైసన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రంతో విజయ్ దేవరకొండ హిందీ అరంగేట్రం చేస్తుంటే, అనన్య పాండే దక్షిణాది భాషల్లోకి ఎంట్రీ ఇస్తోంది. ఇందులో రమ్య కృష్ణన్, రోనిత్ రాయ్, విషు రెడ్డి, అలీ, మకరంద్ దేశ్‌పాండే మరియు గెటప్ శ్రీను కూడా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.