ATV Originals : ‘షో టైం’ సినిమా తీద్దాం రండీ రియాలిటీ షో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ నిర్మాత, ఏకే ఎంటర్ టైన్మెంట్స్ అధినేత అనిల్ సుంకర ఒక కొత్త రియాల్టీ షోకు శ్రీకారం చుట్టారు. సినిమా రంగంలో రాణించాలనుకునే ఔత్సాహికులకు ఒక అద్భుతమైన అవకాశాన్ని ఈ రియాల్టీ షో ద్వారా కల్పించనున్నారు. మొత్తం 16 సినిమా స్క్రిప్ట్స్, ఆ స్క్రిప్ట్ ను పరిశీలించడానికి 12 మంది జడ్జీలు, సినిమాకు స్క్రిప్ట్ సెలెక్ట్ చేయడం నుంచి ఆర్టిస్టులు, రచయితలు ఇలా 24 విభాగాల్లో పని చేసే టెక్నీషియన్లను మొత్తం 75 రోజుల్లో ఎన్నుకునే విధానాన్ని రియాల్టీ షో రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.
Also Read : Tollywood Bundh : బంద్ పై మెగా పంచాయితీ.. తీర్పు ఆమోదయోగ్యంగా ఉంటుందా?
Also Read
- Nagarjuna: "ఈ అరుపుల కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురుచూశాడు".. 'లెనిన్' సక్సెస్ మీట్లో నాగార్జున ఎమోషనల్!
- Nag Chaitanya: 'ఆ రోజు నుంచే అఖిల్ నా హీరో'.. తమ్ముడిపై నాగచైతన్య ఎమోషనల్ కామెంట్స్!
- Monalisa: ‘నా జీవితం ప్రమాదంలో ఉంది’.. కుంభమేళా ఫేమ్ మోనాలిసా!
- NBK సినిమాలో ఐశ్వర్య రాజేశ్? ఇప్పటి వరకు చేయని పాత్రలో క్రేజీ బ్యూటీ!
‘షో టైం’ సినిమా తీద్దాం రండి అనే ఉపశీర్షికతో ఒక రియాల్టీ షో ను తీసుకురాబోతున్నారు. దీనికి సంబంధించి శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నిర్మాత అనిల్ సుంకర మాట్లాడుతూ ‘చాలామంది సినిమా తీయాలన్నా కళతో తమ దగ్గర ఉన్న డబ్బులన్నీ పెట్టి సినిమా నిర్మిస్తారు కానీ దాన్ని విడుదల చేయడానికి చాలా కష్టాలు పడతారు. చాలామంది డబ్బులు పోగొట్టుకున్న సందర్భాలు కూడా చూసాను. అలాగే ఈ రోజుల్లో సినిమా నిర్మాణ వ్యయం కూడా విపరీతంగా పెరిగిందని, ప్రొడక్షన్ లో చాలావరకు అనవసరమైన ఖర్చులను తగ్గించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి సవాళ్లు ఎన్నో సినిమా తీసే నిర్మాతకు ఎదురవుతున్నాయని వాటన్నింటినీ ఈ రియాల్టీ షో ద్వారా చూపించే ప్రయత్నం చేస్తున్నాం. అన్ని రియాల్టీ షోలా మాదిరిగానే ఇది కూడా ఎలాంటి స్క్రిప్ట్ లేని రియాల్టీ షో అని, ఇది ఒక ప్రముఖ ఓటీటీలో ఇంటర్నేషనల్ వైడ్ గా స్ట్రీమింగ్ అవబోతుంది. ఇక ఈ షో కు మొత్తం 16 స్క్రిప్ట్‌లను ఎంపిక చేసుకొని అందులో 4 బెస్ట్ స్క్రిట్లను 12 మంది జడ్జీలు ఫైనల్ చేస్తారు. ఆ ఫైనల్ అయిన స్క్రిప్ట్‌లకు అన్ని విభాగాల్లో పనిచేసే నిపుణులను ఆర్టిస్టులను షోలోనే ఎన్నుకుంటారు. ఇక ఆ స్క్రిప్ట్స్ నేరుగా ఆసక్తి ఉన్న నిర్మాతలు బెడ్డింగ్ చేసి ఒక కోటి రూపాయల లో కేవలం 30 రోజులలోనే సినిమా పాటలతో సహా షూటింగ్ జరిపేలా ఒక అద్భుతమైన ప్రణాళికను రెడీ చేయబోతున్నాం. ఈ రియాల్టీ షో కి సంబంధించి ఆ తర్వాత షో గురించి మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తామని చెప్పారు.
తాజావార్తలు
-
Astrology: జూలై 21 మంగళవారం దినఫలాలు..
-
New Airport: మారబోతున్న ఉత్తర తెలంగాణ రూపురేఖలు.. రూ. 496.86 కోట్లతో ఆ విమానాశ్రయానికి ఆమోదం..
-
Naga Chaitanya : నాగార్జున నైజం బయటపెట్టిన నాగచైతన్య.. ‘లెనిన్’ సక్సెస్ మీట్లో సంచలన వ్యాఖ్యలు!
-
Indian IPL Player: బిగ్‌షాక్.. ఆ IPL స్టార్ ఆటగాడిని వెంటనే అరెస్ట్ చేయండి.. హైకోర్టు ఆదేశం..
-
Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్ కేసులో కొత్త మలుపు.. మద్యం మత్తే.. ఆత్మహత్యాయత్నం కాదంటున్న పోలీసులు!
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్‌కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్‌లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!