Site icon NTV Telugu

Chiranjeevi-Balayya: చిరు, బాలయ్యలకు సొంత అడ్డాల్లో థియేటర్స్ తగ్గనున్నాయా?

Chiru Vs Balayya

Chiru Vs Balayya

Chiranjeevi-Balayya: మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణలు మూడు దశాబ్దాలుగా స్టార్ స్టేటస్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ఇద్దరి హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అంటే తెలుగు రాష్ట్రాల్లో పండగ వాతావరణం నెలకొంటుంది. అలాంటిది ఇద్దరి సినిమాలు పండగకే వస్తే ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. 2017లోనే చిరు బాలయ్యలు ‘ఖైదీ నంబర్ 150’, ‘గౌతమీ పుత్ర శాతకర్ణీ’ సినిమాలతో సంక్రాంతి బరిలో దిగి, అభిమానులని మెప్పించారు. ఇదే మ్యాజిక్ ని రిపీట్ చేస్తూ మెగా నందమూరి బాక్సాఫీస్ వార్ కి 2023 సంక్రాంతి సీజన్ సిద్ధమయ్యింది. చిరు నటిస్తున్న ‘వాల్తేరు వీరయ్య'(VALTERU VEERAYYA) బాలయ్య నటిస్తున్న ‘వీర సింహా రెడ్డి'(VEERA SIMHA REDDY) సినిమాలు సంక్రాంతి సీజన్ లో ప్రేక్షకుల ముందుకి రానున్నాయి. వింటేజ్ చిరుని చూపిస్తానని దర్శకుడు బాబీ, బాలయ్య ఫ్యాక్షన్ రోల్ లో ఇరగదీస్తాడు అంటూ గోపీచంద్ మలినేని తమ సినిమాలని ప్రమోట్ చేస్తున్నారు.

చిరు బాలయ్యల మధ్య జరగనున్న బాక్సాఫీస్ వార్ లోకి తమిళ హీరో దళపతి విజయ్ వచ్చి చేరాడు. దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్న ‘వారిసు/వారసుడు’ (VARISU/VARASUDU) సినిమా కూడా సంక్రాంతికే షెడ్యూల్ అయ్యి ఉంది. ఈ సినిమా విడుదల విషయంలో వివాదం జరుగుతుంది కానీ దిల్ రాజు మాత్రం తన సినిమాని దాదాపు సంక్రాంతికే రిలీజ్ చేసేలా ఉన్నాడు(VARISU RELEASE ISSUE). ఇదే జరిగితే చిరు, బాలయ్యలకి థియేటర్స్ తగ్గే అవకాశం ఉంది. దిల్ రాజుకి నైజాంలో మంచి పట్టుంది. అందుకే ‘వారిసు’ సినిమాకి నైజాం ఎక్కువ థియేటర్స్ దొరికడం గ్యారెంటి. అయితే మెగా ఫ్యామిలీ మరీ ముఖ్యంగా చిరుకి నైజాంలో స్ట్రాంగ్ హోల్డ్ ఉంది. చిరు నటించిన ఏ సినిమా రిలీజ్ అయినా అది టాక్ తో సంబందం లేకుండా నైజాంలో మంచి కలెక్షన్స్ ని రాబడుతూ ఉంటుంది. ఇప్పుడు దిల్ రాజు ‘వారిసు’ సినిమాకి ఎక్కువ థియేటర్స్ కేటాయిస్తే చిరుని స్ట్రాంగ్ హోల్డ్ ఉన్న నైజాంలో ‘వాల్తేరు వీరయ్య’ సినిమా కలెక్షన్స్ కి డెంట్ పడే ఛాన్స్ ఉంది. అలాగే బాలకృష్ణకి గుంటూరు, కృష్ణ జిల్లాల్లో మంచి గ్రిప్ ఉంది. సీడెడ్ తర్వాత బాలయ్య స్ట్రాంగ్ జోన్ ఏదైనా ఉందా అంటే అది కృష్ణ, గుంటూరు జిల్లాల్లోనే. ఈ ప్రాంతాల్లో బాలయ్య సినిమాలు మంచి కలెక్షన్స్ ని రాబడుతూ ఉంటాయి. దిల్ రాజు ‘వారిసు’ సినిమా కోసం కృష్ణ గుంటూరు ప్రాంతాల్లో కూడా ఎక్కువ థియేటర్స్ ని వారిసు కోసం హోల్డ్ చేస్తే, ‘వీర సింహా రెడ్డి’ సినిమా వసూళ్లలో కూడా డ్రాప్ కనిపించే అవకాశం ఉంది. పైగా ‘వాల్తేరు వీరయ్య’, ‘వీర సింహా రెడ్డి’ సినిమాలని ప్రొడ్యూస్ చేసింది మైత్రి మూవీ మేకర్స్. రెండు స్టార్ హీరోల సినిమాలకి ఓపెనింగ్స్ తగ్గితే, అది మైత్రి మూవీ మేకర్స్ కి గట్టి దెబ్బే. ఈ విషయం గమనించి చిరు బాలయ్యలు దిల్ రాజుతో మాట్లాడడానికి రంగంలోకి దిగుతారా? లేక సంక్రాంతి సీజన్ లో లాంగ్ హాలీడే పీరియడ్ ఉంటుంది కాబట్టి ఆడియన్స్ ఏ సినిమా బాగుంటే ఆ సినిమాని ఆదరిస్తారు అనే ఆలోచనతో సైలెంట్ గా ఉంటారా అనేది చూడాలి.

Exit mobile version