NTV Telugu Site icon

Leo: లియో దాస్.. ట్రైలర్ తోనే సెన్సేషన్ సెట్ చేసేలా ఉన్నాడే

Leo

Leo

Leo:కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఈ ఏడాది వారసుడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. దీంతో అభిమానులు అందరూ విజయ్ నటిస్తున్న లియో సినిమాపైనే ఆశలు పెట్టుకున్నారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సెవెన్ స్క్రీన్ స్టూడియో పై లలిత్ కుమార్ నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో విజయ్ సరసన త్రిష నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ మధ్యనే రిలీజ్ అయిన రెండు సాంగ్స్ మ్యూజిక్ లవర్స్ ను ఆకట్టుకున్నాయి. ఇక ఎప్పుడెప్పుడు అని ఎదురుచూస్తున్న లియో ట్రైలర్ కు సంబంధించిన తాజా అప్డేట్ ను మేకర్స్ అనౌన్స్ చేశారు.

Mounika Reddy: పెళ్లి అయ్యి ఏడాది కూడా కాకముందే భీమ్లా నాయక్ నటి విడాకులు..?

అక్టోబర్ 5 న ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. అంతేకాకుండా ఇందుకు సంబంధించిన పోస్టర్ను కూడా మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో విజయ్ ఒక మంచు ప్రదేశంలో తోడేలను ఎదుర్కోవడానికి కర్ర పట్టుకుని వెళ్తున్నట్లు కనిపించాడు. ఇక విజయ్ ను గమనిస్తే రక్తమోడుతూ కనిపించాడు. మొదటినుంచి కూడా ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. అంతేకాకుండా లోకేష్, విజయ్ కాంబోలో ఇప్పటికే మాస్టర్ అనే సినిమా వచ్చింది. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. దీంతో ఈ కాంబోపై అభిమానులు ఎంతో ఆశ పెట్టుకున్నారు. అది కాకుండా విజయ్ సినిమాలు ఆపేస్తున్నాడు అని తెలియడంతో అతని చివరి సినిమాలపై మరింత ఆసక్తిని పెంచేశారు. మరి ఈ ఈ సినిమా ట్రైలర్ తో విజయ్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడు చూడాలి.

Show comments