Maniratnam: రాజమౌళిని విడవని మణిరత్నం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎందరో దర్శకులకు అభిమాన దర్శకునిగా నిలిచారు మణిరత్నం. ఆయన తెరకెక్కించిన ‘నాయకన్’ చిత్రం ‘టైమ్’ టాప్ హండ్రెడ్ లో చోటు సంపాదించింది. ఇక ఆయన టేకింగ్ స్టైల్ కు ఎంతోమంది సినీజనం ఫిదా అయిపోయారు. మణిరత్నం చిత్రాల జయాపజయాలతో నిమిత్తం లేకుండా ఈ నాటికీ ఎంతోమంది ఆయన సినిమాలను చూస్తున్నారు. అంతటి ఘనత వహించిన మణిరత్నం, గత సంవత్సరం తన ‘పొన్నియిన్ సెల్వన్-1’ విడుదల సమయంలో తమకు ఇంటర్నేషనల్ మార్కెట్ లో రాజమౌళి డోర్స్ తెరిచారని వ్యాఖ్యానించారు. అప్పట్లో కొందరు మణిరత్నం ఫ్యాన్స్ కు ఈ మాటలు బాధ కలిగించాయి. ‘మణిరత్నం ఎక్కడా? రాజమౌళి ఎక్కడా?’ అనీ కొందరు కామెంట్స్ చేశారు. అలా కామెంట్స్ చేసిన వారికి రాజమౌళి ‘ట్రిపుల్ ఆర్’ మూవీ అంతర్జాతీయంగానూ తనదైన బాణీ పలికిస్తూ సమాధానం చెప్పింది. ఆ సంగతి వదిలేస్తే- రాజమౌళి బాటను ఇంకా మణిరత్నం ఫాలో అవుతున్నారనే కొందరు పరిశీలకులు అంటున్నారు.
‘బాహుబలి’ ఛాయల్లోనే తన భారీ చారిత్రక చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్’ను రూపొందించారు మణిరత్నం. ఈ సినిమా తెలుగు వర్షన్ అంతగా అలరించలేదు. కానీ తమిళ వర్షన్ ప్రపంచ వ్యాప్తంగా రూ.400 కోట్లు పోగేసింది. ఈ నేపథ్యంలో మణిరత్నం తన ‘పొన్నియిన్ సెల్వన్-2’ చిత్రాన్ని ఏప్రిల్ లో జనం ముందు నిలపడానికి సిద్ధమవుతున్నారు. నిజానికి ఒకప్పుడు దక్షిణాదిన ఓ సెంటిమెంట్ ఉండేది. అదేమిటంటే, సౌత్ లో తీసిన సీక్వెల్స్ ఏవీ అంతగా విజయం సాధించవు అన్నదే ఆ నమ్మకం! కానీ, రాజమౌళి ‘బాహుబలి-2’ చిత్రం ‘బాహుబలి-1’ కంటే భారీ విజయం నమోదు చేసి, ఆ సెంటిమెంట్ ను చెరిపేసింది. అందువల్ల రాజమౌళి ఇచ్చిన స్ఫూర్తితో మణిరత్నం సైతం తన ‘పొన్నియిన్ సెల్వన్-2’పై ఆశలు మెండుగానే పెంచుకున్నారు. అంతేకాదు ‘పొన్నియిన్ సెల్వన్-2’ సినిమాను ‘బాహుబలి-2’ విడుదలైన ఏప్రిల్ 28వ తేదీనే మణిరత్నం కూడా విడుదల చేయడానికి పూనుకోవడం విశేషం! ఆరేళ్ళ క్రితం 2017లో ఏప్రిల్ 28న రిలీజ్ అయిన ‘బాహుబలి-2’ అనూహ్య విజయం సాధించింది. అదే తేదీన విడుదలకు సిద్ధమైన మణిరత్నం ‘పొన్నియిన్ సెల్వన్-2’ కూడా గ్రాండ్ సక్సెస్ చూస్తుందేమో అని సినీఫ్యాన్స్ భావిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా రూ.400 కోట్లు పోగేసిన ‘పొన్నియిన్ సెల్వన్-1’ సీక్వెల్ గా వస్తోన్న ఈ రెండోభాగానికి తెలుగునాట కొనుగోలుదారులు కరువయ్యారట! కనీసం రాజమౌళిని ఫాలో అవుతున్నందుకైనా ‘పొన్నియిన్ సెల్వన్-2’కు భారీ బిజినెస్ జరుగుతుందేమో చూడాలి.
Also Read
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్‌కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్‌ఫ్లిక్స్‌లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!