ప్రముఖ సినిమాటోగ్రాఫర్ చోటా కె నాయుడు తమ్ముడు శ్యామ్ కె నాయుడు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ నటి అయిన శ్రీసుధతో ఐదేళ్లు సహజీవనం చేసి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన విషయం తెల్సిందే. తనకు న్యాయం చేయాలంటూ సుధ పోలీస్ స్టేషన్ల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరుగుతున్న విషయం విదితమే. ఇక ఈ కేసులో శ్యామ్ ని అరెస్ట్ చేసిన పోలీసులు ఆయనను కోర్టులో ప్రవేశపెట్టారు. అతడి నుంచి తనకు ప్రాణ హాని ఉందని, తనకు బెయిల్ ఇస్తే తనను చంపేస్తారని తెలుపుతూ సుధ సుప్రీం కోర్టులో పిటిషన్ పెట్టగా.. తాజాగా సుప్రీం కోర్టు ఆ పిటిషన్ ని కొట్టి పడేసింది. దీంతో శ్యామ్ కి బెయిల్ మంజూరు అయ్యింది.
ఇక ఈ విషయంపై నటి సుధ పేస్ బుక్ ద్వారా స్పందించింది. ” నేను ఎదుర్కోవడానికి రెడీ గా ఉన్నాను.. ఈ కేసును వదిలేది లేదు” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. గత మూడేళ్ళ నుంచి ఈ కేసు నడుస్తోంది. శ్యామ్ కె నాయుడు తనను చిత్ర హింసలు పెట్టి, తనను చంపాలని చూస్తున్నాడని, పెళ్లి చేసుకోమని అడిగినందుకు తనను లైంగికంగా వేధించినట్లు సుధ తెలిపారు. మరి ఈ కేసు ఎలాంటి మలుపులు తీసుకోనుందో ముందు ముందు చూడాలి.
