ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “పుష్ప” చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. రెండు భాగాల యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో రష్మిక మందన్న, ఫహద్ ఫాసిల్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే చిత్రం నుంచి కొన్ని ఆసక్తికర అప్డేట్లను విడుదల చేసి బన్నీ ఫ్యాన్స్ లో ఉత్సాహం రెట్టింపు చేశారు మేకర్స్. అయితే “పుష్ప’రాజ్ ను ఇంకా లీకుల సమస్య వదలలేదు. తాజాగా సెట్స్ నుండి లీకైన వీడియో సోషల్ మీడియా వైరల్ అవుతోంది. నవంబర్ 4న దీపావళి సందర్భంగా “పుష్ప : ది రైజ్” నిర్మాతలు స్టైలిష్ స్టార్ నటించిన రాకింగ్ డ్యాన్స్ నంబర్ నుండి స్టిల్‌ను పంచుకున్నారు. “పుష్ప” నుండి రాకింగ్ నంబర్ ప్రస్తుతం 1000 మందికి పైగా డ్యాన్సర్లతో భారీ స్థాయిలో చిత్రీకరించబడుతోంది. ఇది బిగ్ స్క్రీన్‌లో మాస్ ఫీస్ట్ కానుంది అంటూ అంచనాలను పెంచేశారు మేకర్స్. అయితే తాజాగా లీక్ అయిన వీడియో అదే పాట చిత్రీకరణకు సంబంధించినది.
Read Also : “సర్కారు వారి పాట”లో కీర్తి సరిగమలు
సెట్ మొత్తం జాతర వాతావరణాన్ని తలపిస్తోంది. ఆ వీడియోలో “హే బిడ్డా ఇది నా అడ్డా” అంటూ మాస్ బీట్ వినిపిస్తుండగా, రంగురంగుల పొగ మధ్య అల్లు అర్జున్ పలువురు బ్యాక్‌గ్రౌండ్ డ్యాన్సర్‌లతో అదిరిపోయే స్టెప్పులేస్తున్నాడు. ఈ వీడియో చూస్తుంటే ఖచ్చితంగా సాంగ్ బిగ్ స్క్రీన్‌లో మాస్ ఫీస్ట్ అన్పిస్తోంది. ఇది అభిమానులకు ఉత్సాహాన్ని కలిగిస్తున్నప్పటికీ, ప్రేక్షకులకు ఆశ్చర్యం కలిగించే అంశాన్ని రివీల్ చేయకుండా సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్న మేకర్స్‌కు మాత్రం ఇబ్బందికరంగా మారుతోంది. ఈ వీడియో చూస్తుంటే థియేటర్స్ దద్దరిల్లడం ఖాయం అన్పిస్తోంది.