NTV Telugu Site icon

Laya Gorty: హీరోయిన్ లయ కూతురును చూశారా.. అచ్చుగుద్దినట్లు తల్లిని దింపేసింది

Laya

Laya

Laya Gorty: స్వయంవరం సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన తెలుగమ్మాయి లయ. మొదటి సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న ఆమె.. స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. ఇక కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకొని అమెరికాలో సెటిల్ అయిపోయింది. అంతకుముందు ఎలా ఉన్నా ఇప్పుడు సోషల్ మీడియా వచ్చాకా ఎక్కడ ఉన్నా అందరికి దగ్గరగానే ఉంటున్నారు. ప్రస్తుతం లయ రీ ఎంట్రీ కోసం ప్రయత్నాలు చేస్తుందా..? లేదా అన్న విషయం పక్కన పెడితే.. తనలో ఉన్న ట్యాలెంట్ ను మాత్రం అభిమానులతో పంచుకుంటుంది. స్నేహితులతో కలిసి నిత్యం రీల్స్ చేస్తూ అభిమానులకు దగ్గర అవుతూనే ఉంది. ఇక లయకు ఇద్దరు పిల్లలు.. ఒక పాప.. ఒక బాబు. పాప శ్లోకా.. చైల్డ్ ఆర్టిస్ట్ గా రవితేజ హీరోగా నటించిన అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాలో నటించి మెప్పించింది. చిన్నప్పటి ఇలియానాగా శ్లోకా కనిపించింది.

Nagavamsi: ఆ సినిమా పోతుందని నాకు, త్రివిక్రమ్ కు ముందే తెలుసు, కానీ..

ఇక తాజాగా లయ తన ఫ్యామిలీ ఫోటోను అభిమానులతో షేర్ చేసుకుంది. భర్త పిల్లలతో కలిసి అభిమానులకు వాలెంటెన్స్ డే శుభాకాంక్షలు తెలిపింది. ఈ ఫొటోలో లయ, శ్లోకా రెడ్ డ్రెస్ లో అందంగా కనిపించారు. శ్లోకా తల్లిగా తగ్గ అందంతో హీరోయిన్ లా కనిపిస్తోంది. ఇక లయ, శ్లోకాను చూసిన వారందరు అమ్మాకూతుళ్లులా లేరు.. అక్కాచెలెళ్లులా ఉన్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. చక్కటి కుటుంబం అని ఇంకొందరు చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం శ్లోకా చదువుకొంటుంది. ఆమెకు కూడా ఇండస్ట్రీ మీద ఇంట్రెస్ట్ ఉంటే లయ.. తన కూతురిని హీరోయిన్ గా పరిచయం చేస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. మరి ముందు ముందు ఈ చిన్నది టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుందేమో చూడాలి.

Show comments