Site icon NTV Telugu

Raghava Lawrence : వాళ్లపై నోట్ల వర్షం కురిపించిన లారెన్స్.. ఎందుకంటే..

Raghava

Raghava

Raghava Lawrence : లారెన్స్ సినిమాలతో ఎంత గుర్తింపు తెచ్చుకున్నాడో.. తన వ్యక్తిత్వంతోనూ అంతకంటే ఎక్కువ గుర్తింపు సాధించాడు. ఎంతో మందికి నిత్యం ఏదో ఒక రకమైన సాయం అందిస్తూనే ఉంటాడు. అప్పట్లో డబ్బులు చెదలు పట్టిపోయాయని బాధపడ్డ జంటకు అండగా నిలిచాడు. వారికి ఆ డబ్బులు ఇచ్చాడు. రీసెంట్ గా ఓ దివ్యాంగురాలికి సొంతంగా ఇల్లు కట్టించాడు. ఇంకో స్టూడెంట్ చదువులకు డబ్బులు ఇచ్చాడు. ఇప్పుడు తాజాగా కొందరు దివ్యాంగులు అయినా డ్యాన్స్ లో ఇరగదీస్తున్నారని.. వారిని పిలిచి డబ్బుల వర్షం కురిపించాడు లారెన్స్.

Read Also : Maruthi : బూతులు మాట్లాడితేనే సినిమాలు చూస్తున్నారు..

తాను డ్యాన్స్ చేయడం మొదలు పెట్టినప్పుడు ప్రేక్షకులు తనమీద రూపాయి నోట్లు చల్లేవారని.. అది తనకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చిందన్నాడు. ఇప్పుడు తాను కూడా అలాంటి వారిని ప్రోత్సహించేందుకు ఇలా డబ్బుల వర్షం కురిపించినట్టు తెలిపాడు లారెన్స్. ఇది కేవలం సాయం మాత్రమే కాదని.. వారికి ఎంతో ప్రోత్సహం ఇవ్వడం అన్నాడు లారెన్స్. ఇందుకు సంబంధించిన వీడియోను స్వయంగా సోషల్ మీడియాలో పోస్టు చేశాడు లారెన్స్. దెబ్బకు ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. లారెన్స్ కేవలం డ్యాన్సర్ గానే కాకుండా యాక్టర్ గా, డైరెక్టర్ గా ఎంతో పేరును సంపాదించుకున్నాడు.

Read Also : SSMB 29 : మహేశ్ బాబుతో కొత్త ప్లేస్ లో రాజమౌళి షూటింగ్..

Exit mobile version