Lavanya : మా రామ్ చరణ్‌ బావకి థాంక్స్!

Whatsapp Image 2026 05 02 At 7.42.23 Pm

Whatsapp Image 2026 05 02 At 7.42.23 Pm

లావ‌ణ్య త్రిపాఠి కొణిదెల, దేవ్ మోహన్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెరకెక్కిన చిత్రం ‘సతీ లీలావతి’. ప్రముఖ నిర్మాణ సంస్థ ఆనంది ఆర్ట్స్ సమర్పణలో దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యానర్‌పై నాగ‌మోహ‌న్ ఈ చిత్రాన్ని నిర్మించారు. భీమిలీ కబడ్డీ జట్టు, ఎస్‌.ఎం.ఎస్‌(శివ మ‌న‌సులో శృతి) ఫేమ్ తాతినేని స‌త్య దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని మే 8న వ‌ర‌ల్డ్ వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు మేక‌ర్స్‌. ఈ క్రమంలో శనివారం నాడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ మేరకు నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో..

లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ* .. ‘‘సతీ లీలావతి’ కోసం మేం పెట్టిన శ్రమ, మా ప్రేమ, మా కష్టం అంతా తెరపై ఆడియెన్స్ చూస్తారు. సత్య గారు, ఉదయ్ గారు మంచి కథను నా వద్దకు తీసుకు వచ్చారు. ‘సతీ లీలావతి’ అద్భుతంగా వచ్చింది. ఈ చిత్రం కోసం నాగ మోహన్ గారు చాలా కష్టపడ్డారు. నేను చిత్రీకరణ సమయంలో ప్రెగ్నెంట్ అని తెలిశాక టీం మొత్తం సపోర్ట్ చేసింది. దేవ్ గారు సొంతంగా డబ్బింగ్ చెప్పారు. మా ట్రైలర్‌ను రిలీజ్ చేసిన మా బావ గారు రామ్ చరణ్‌కి థాంక్స్. ఆయన రిలీజ్ చేయడం వల్ల మా ట్రైలర్‌కి, మా సినిమాకు రీచ్ పెరిగింది. మా ట్రైలర్‌ని అందరూ చూసి సపోర్ట్ చేయండి. మే 8న మా సినిమాని చూసి సపోర్ట్ చేయండి’ అని అన్నారు.