టాలీవుడ్‌లో అందమైన జంటగా పేరు తెచ్చుకున్న లావణ్య త్రిపాఠి–వరుణ్ తేజ్‌ల ప్రేమకథ అందరికీ తెలిసిందే. మొదట స్నేహితులుగా మొదలైన ఈ జంట బంధం క్రమంగా ప్రేమగా మారి చివరికి జీవిత భాగస్వాములయ్యారు. ఇటలీలోని టస్కనీలో 2023 నవంబర్ 1న జరిగిన వారి డెస్టినేషన్ వెడ్డింగ్ సినిమాలా అద్భుతంగా సాగింది. మెగా ఫ్యామిలీ మొత్తాన్ని ఒకే చోట చేర్చిన ఆ వేడుకలో రామ్ చరణ్, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్, నిహారికలు తెగ ఎంజాయ్ చేశారు. వివాహం అనంతరం కూడా ఈ జంట తమ బంధాన్ని ఎప్పటికప్పుడు చిన్న చిన్న సంతోషాలతో మరింత బలపరుస్తూ వస్తున్నారు.
Also Read : Kanchana4 : పూజ – నోరా కాంబోతో లారెన్స్ కాంచన 4.. హారర్ కి గ్లామర్ టచ్..!
వారి ప్రేమకు గుర్తుగా ఈ ఏడాది జూన్‌లో తాము తల్లిదండ్రులు కాబోతున్నామని ప్రకటించి అభిమానులను ఆనందపరిచారు. ఆ తర్వాత సెప్టెంబర్ 10న పండంటి బిడ్డకు జన్మనిచ్చి మెగా కుటుంబానికి కొత్త వారసుడిని అందించారు. తమ బిడ్డకు ‘వాయు తేజ్’ అని పేరు పెట్టి, నామకరణ వేడుకను కూడా ఎంతో ఘనంగా జరిపారు. ఇక ఇటీవల దీపావళి సందర్భంగా వాయుతో కలిసి కుటుంబం మొత్తం హర్షం హుషారుగా ఉత్సవాన్ని జరుపుకుంది. ఇక ఇప్పుడు, తమ వివాహ బంధం రెండేళ్లు పూర్తైన సందర్భంగా లావణ్య త్రిపాఠి తన భర్త వరుణ్ తేజ్‌కు ఒక ప్రేమతో నిండిన సందేశాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.
బ్లాక్ అండ్ వైట్ ఫోటోలలో రొమాంటిక్ క్షణాలను పంచుకుంటూ “స్నేహితుడి నుండి ప్రియుడు, తర్వాత భర్త, ఇప్పుడు తండ్రి వరకు.. ప్రతి పాత్రను మీరు అద్భుతంగా పోషించారు. మా జీవితంలో మిమ్మల్ని కలిగి ఉండటం అదృష్టం. మీ మనసు చాలా మంచిది. వార్షికోత్సవ శుభాకాంక్షలు” అని రాసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అభిమానులు, సినీ సెలబ్రిటీలు కామెంట్స్ ద్వారా లవణ్య–వరుణ్ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
