Sarkaru Vaari Paata : ఊర మాస్ సాంగ్ లోడింగ్… రిలీజ్ కు టైం ఫిక్స్

Sarkaru vaari Paata

Sarkaru vaari Paata

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన “సర్కారు వారి పాట” మూవీ. మహేష్ ఫ్యాన్స్ అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ మూవీ మే 12న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం “సర్కారు వారి పాట” మ్యూజికల్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు మేకర్స్. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన “కళావతి”, “పెన్నీ” సాంగ్స్ కు మంచి స్పందన రాగా, సినిమాలో నుంచి మూడవ పాటను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు ఊర మాస్ సాంగ్ విడుదలకు ముహూర్తం ఖరారయ్యింది అంటూ ఓ క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. అందులో టైటిల్ సాంగ్‌ను ఏప్రిల్ 23న ఉదయం 11:07 గంటలకు విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.

Read Also : Maruthi : స్టార్ డైరెక్టర్ ఇంట తీవ్ర విషాదం

×
×
Ad

మరోవైపు తనదైన స్టైల్ లో విడుదలకు ముందే చిన్న చిన్న వీడియోలను రిలీజ్ చేస్తూ తమన్ సాంగ్ పై ఆసక్తిని పెంచేస్తున్నాడు. తాజాగా “సర్కారు వారి పాట” సాంగ్ కు సంబంధించిన చిన్న మ్యూజిక్ వీడియోను విడుదల చేశాడు. మరి ఈ మాస సాంగ్ ఎలా ఉంటుందో చూడాలి. కాగా ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, GMB ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.