Site icon NTV Telugu

Rashmika: పాన్ ఇండియా మూవీలో రష్మిక ఐటెం సాంగ్.. ఆ హీరో కోసమేనా..?

rashmika

rashmika

ప్రస్తుతం ఐటెం సాంగ్ అంటే.. ఇలాంటి వాళ్లే చేయాలి అనే రూల్ లేదు.. స్టార్ హీరోయిన్లు సైతం ఐటెం సాంగ్ అంటే పడిచచ్చిపోతున్నారు.. స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ల్ ఐటెం సాంగ్ అంటే సినిమాకే కాకుండా సాంగ్ చేసిన హీరోయిన్ కి కూడా అంతే పేరు వస్తుంది.. అంతేకాకుండా అభిమానులకు తమ సత్తా ఏంటో చూపించవచ్చు అని హీరోయిన్లు ఐటెం సాంగ్స్ కి సాయి అంటున్నారు. ఇప్పటికే తమన్నా, సమంత లాంటి పెద్ద హీరోయిన్లు స్టార్ హీరోల సినిమాల్లో కాలు కదిపిన సంగతి తెల్సిందే.. ఇక తాజాగా వీరి లిస్టులోకి చేరిపోయింది నేషనల్ క్రష్ రష్మిక.. అవునండీ .. రష్మిక కూడా ఒక ఐటెం సాంగ్ లో కనిపించబోతుందని టాక్ వినిపిస్తోంది.

అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ అయిన సందీప్ రెడ్డి వంగ రెండో సినిమాగా బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ తో యానిమల్ ని తెరకెక్కిస్తున్న సంగతి తెల్సిందే. టీ సిరీస్‌ భూషణ్‌ కుమార్‌, భద్రకాళీ పిక్చర్స్‌, సినీ స్టూడియోస్‌ వన్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నఈ పాన్ ఇండియా చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ఉండనున్నదట.. దానికోసం రష్మిక అయితే బావుంటుందని మేకర్స్ అభిప్రాయపడుతున్నారని బాలీవుడ్ టాక్.. త్వరలోనే రష్మిక తో మేకర్స్ సంప్రదింపులు కూడా జరపనున్నారట. బాలీవుడ్ హీరో రణబీర్ కోసమైనా రష్మిక ఒప్పుకొనే ఛాన్స్ ఉందని అంటున్నారు. మరి స్పెషల్ సాంగ్ చేయడానికి రష్మికా మందన్నా ఒప్పుకుంటుందో ? లేదో చూడాలి అంటున్నారు అభిమానులు..

Exit mobile version