Site icon NTV Telugu

Anushka Shetty: అమలా పాల్ మాజీ భర్తతో అనుష్క లాక్..?

anushka

anushka

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి ప్రస్తుతం సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చిన సంగతి తెలిసిందే. చివరగా ఆమె నిశ్శబ్దం సినిమాతో అభిమానులను పలకరించింది. ఇక మద్యమద్యలో హైదరాబాద్ కి వచ్చినప్పుడు ఎయిర్ పోర్టు లో కనిపించడం తప్ప స్వీటీ దర్శనం కూడా లేదు. ఇక ఇటీవలే యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో ఒక సినిమా ఒప్పుకున్నది. మహేష్ బాబు. పి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి సరసన అనుష్క నటించనుంది.అయితే చాలారోజుల నుంచి అనుకశాఖ పెళ్లి చేసుకొని సెటిల్ అవ్వడానికి చూస్తుంది. అందుకే వరుస సినిమాలను ఒప్పుకోవడంలేదనే టాక్ వినిపిస్తోంది.

స్వీటీ పేరెంట్స్ కూడా పెళ్లి ప్రయత్నాల్లో ఉన్నట్లు సమాచారం. అయితే ఈలోపు స్వీటీ వీలైనన్ని సినిమాలలో నటించాలని చూస్తున్నదట. ఇందులో భాగంగానే ఒక తమిళ్ డైరెక్టర్ కి అమ్మడు ఛాన్స్ ఇచ్చిందని వార్తలు గుప్పుమంటున్నాయి. కోలీవుడ్ బ్యూటీ అమలా పాల్ మాజీ భర్త, డైరెక్టర్ ఎఎల్ విజయ్ దర్శకత్వంలో అమ్మడు ఒక సినిమా చేయనున్నదట . ఇప్పటికే వీరిద్దరి కాంబోలో నాన్న సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ప్రయోగాత్మకమైన కథను విజయ్, స్వీటీ కి చెప్పడం, ఆమె ఒప్పుకోవడం కూడా జరిగినట్లు కోలీవుడ్ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. ఒక వేళ ఇదే కనుక నిజమైతే త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతున్నట్లే. మరి స్వీటీ ఈ సినిమాలతో విజయాలను అందుకొని వరుస సినిమాలకు సైన్ చేస్తుందేమో చూడాలి.

Exit mobile version