బాలీవుడ్ అడోరబుల్ కపుల్ విక్కీ కౌశల్- కత్రినా కైఫ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పెళ్ళికి ముందు నుంచి ఈ జంట గురించిన వార్తలు ఎప్పుడూ హాట్ టాపికే.. అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకొని పెద్ద దుమారాన్ని రేపిన ఈ జంట పెళ్లి తరువాత ఒకరి కోసం మరొకరు పుట్టారా అన్నట్లు తమ అన్యోన్యతను చూపిస్తున్నారు. నిత్యం ఈ జంట.. కపుల్ గోల్స్ ని సెట్ చేస్తుంటే అభిమానులు వాటిని ఫాలో అయిపోయేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే పెళ్లి అయ్యి కొన్ని నెలలు కూడా కాకముందే కత్రినాను, విక్కీ వదిలేసి వేరే అమ్మాయి ప్రేమలో పడిపోయాడట.. ఏంటీ నిజమా.. అని నోళ్లు వెళ్లబెట్టకండి .. ఇదంతా వెటరన్ కొరియోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ ఫరాఖాన్ మహిమ.. ఇంతకీ విషయం ఏంటంటే.. ప్రస్తుతం విక్కీ తన కొత్త సినిమా షూటింగ్ అందమైన దేశం క్రొయేషియాలో జరుగుతుంది.
ఇక అక్కడ ఫరాఖాన్, విక్కీ తో కలిసి ఒక ఫోటోకు రొమాంటిక్ పోజ్ ఇచ్చింది.. దీన్ని సోషల్ మీడియా లో షేర్ చేస్తూ “సారీ కత్రినా.. విక్కీ మరొకరిని కనుగున్నాడు” అంటూ లవ్ ఎమోజీ యాడ్ చేసింది. ఇక ఫొటోలో ఒక గోడకు ఆనుకొని విక్కీ నిలబడగా.. అతడి భుజాలపై చేయి వాల్చి ఫరాఖాన్ రొమాంటిక్ లుక్ తో కనిపించింది. ఇక ఈ ఫొటోకు కత్రినా స్పందిస్తూ ” మీకు ఆ అవకాశం ఉంది” అని చెప్పుకొచ్చింది. ఈ ఆడవారి మధ్య నలిగిపోయిన విక్కీ చివరికి “మేము ఇద్దరం స్నేహితులం మాత్రమే” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్లు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక వీరి కెరీర్ విషయానికొస్తే విక్కీ ప్రస్తుతం భూమి పెడ్నేకర్ – కియారా అద్వానీతో కలిసి గోవింద నామ్ మేరాలో కనిపించనున్నాడు.. కత్రినా.. శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వంలో విజయ్ సేతుపతితో కలిసి మెర్రీ క్రిస్మస్ చిత్రంలో నటించనుంది. తదుపరి యాక్షన్-థ్రిల్లర్ చిత్రం ‘టైగర్ 3’లో సల్మాన్ ఖాన్ – ఇమ్రాన్ హష్మీ సరసన నటించనుంది.