అక్కినేని నాగ చైతన్య, సమంత ఒకరినొకరు ఎంతగా ప్రేమించుకున్నారో అందరికి తెలిసిందే.. చైతన్య వెనుకే ఉండి ఎన్నోసార్లు ఆమె ముందుకు నడిపిందని, అతడు ప్లాపుల్లో ఉండగా దైర్యం చెప్పి వెన్నుదండుగా నిలిచిందని భర్త కోసం ‘మజిలీ’ సినిమాలో నటించి హిట్ ను అందించిందని అభిమానులు ఎంతో మురిసిపోయారు.. అయితే అలాంటి జంట ఎందుకు విడిపోయారో ఇప్పటికి అభిమానులకు అంతుచిక్కని ప్రశ్నగానే మిగిలిపోయింది. అయితే ఇందులో కొంతమంది చైతన్యది తప్పు అంటే మరికొంతమంది సమంతది తప్పు అంటున్నారు. ఇక ఇవన్నీ పక్కన పెడితే .. పలు సందర్భాల్లో చై పై సామ్ ఎంతటి ప్రేమను చూపించేదే బాహాటంగానే అభిమానులు చూసారు. ఇక ప్రస్తుతం వీరిద్దరి గురించిన ఒక వార్త నెట్టింట వైరల్ గా మారింది. అదేంటంటే.. చై కెరీర్ కోసం సామ్ గట్టిగా ఆలోచించేదని, అతడిని స్టార్ హీరోగా నిలబెట్టడానికి పలు ప్రాజెక్టులను అతడికి ఇష్టం లేకపోయినా బలవంతంగా ఒప్పించిందని టాక్ నడుస్తోంది. అందులో ఒకటే ‘దూత’ వెబ్ సిరీస్. మొదటి నుంచి నాగ చైతన్య దెయ్యాలు అన్నా, దెయ్యం సినిమాలు చూడడం అన్నా చచ్చేంత భయం.. అందుకే ఆయన ఎప్పుడు హర్రర్ మూవీస్ జోలికి పోడు .. ఈ విషయాన్నీ నాగ చైతన్యనే ‘రాజుగారి గది 2’ ప్రమోషన్స్ లో ఒప్పుకున్నాడు.
ఎంత సమంత నటించినా కూడా దెయ్యం సినిమాలు నేను చూడను అని చెప్పుకొచ్చాడు. అయితే అలాంటి చై హర్రర్ జోనర్ లో వస్తున్న దూత వెబ్ సిరీస్ ను ఎలా ఓకే చేశాడు.. అంటే దానికి కారణం సామ్ అనే అంటున్నారు పలువురు. విభిన్నమైన పాత్రలు చేయాలనీ, అన్ని జోనర్స్ చేయడం వలనే మంచి కెరీర్ ఉంటుందని.. కథ బావుండడం, చై పాత్ర కెరీర్ లో గుర్తిపోయేలా ఉంటుందని నమ్మిన సామ్ విక్రమ్ కె కుమార్ చెప్పిన కథను చై కి చెప్పించి ఒప్పించిందట. అంతే కాకుండా దగ్గరఉండి ఆ సినిమా అగ్రిమెంట్ పేపర్స్ మీద సైన్ చేయించిందని టాక్.. ఇది విడాకుల ముందే జరిగిందని, విక్రమ్ ఆ తరువాత చై తో థాంక్యూ మూవీ ని మొదలుపెట్టి దాన్ని ఫినిష్ చేశాక ఈ సిరీస్ ను పట్టాలెక్కించాడని చెప్తున్నారు. అయితే ఈ వార్తలో నిజం ఎంత అనేది తెలియదు కానీ ప్రస్తుతం చైతన్య మాత్రం కెరీర్ లో ఉన్నత స్థాయికి వెళ్లడానికి మాత్రం బాగా కష్టపడుతున్నాడు. ప్రస్తుతం అతని చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. అందులో పాన్ ఇండియా మూవీ ‘లాల్ సింగ్ చద్దా’ ఒకటి.. ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కు సిద్దమవుతుంది. ఈ సినిమా కనుక హిట్ అయితే అక్కినేని హీరో పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు తెచ్చుకున్నట్లే..