మాస్ మహారాజా రవితేజ గురించి పెద్దగా పరిచయం చేయాల్సి అవసరం లేదు. చిరంజీవి తరువాత కష్టపడి పైకి వచ్చిన హీరోల్లో రవితేజ పేరు ప్రథమంగా వినిపిస్తుంది. అసిస్టెంట్ డైరెక్టర్ గా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన రవితేజ.. విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హీరోగా, స్టార్ హీరోగా, మాస్ మహారాజాగా ఎదిగిన తీరు ఎంతమందికి స్ఫూర్తిదాయకం. మధ్యలో రవితేజ గ్రాఫ్ పడిపోయినా, ఎన్ని ప్లాప్స్ వచ్చినా ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం రవితేజ చేతిలో ఐదు సినిమాలు ఉన్నాయి. ఇక హీరోగా పీక్స్ స్టేజిలో ఉండగానే రవితేజ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి.
ప్రస్తుతం హీరోగానే చేస్తూ వస్తున్న రవితేజ.. ఇకనుంచి సపోర్టింగ్ రోల్స్ కి కూడా ఓకే చెప్తున్నాడట. స్టార్ హీరోగానే కాకుండా మరో స్టార్ హీరో సినిమాలో కీలక పాత్రలు చేయడానికి కూడా రెడీ అవుతున్నాడట. కథ నచ్చితే ఇతర హీరోల సినిమాల్లో నటించడానికి తనకేమీ అభ్యంతరం లేదని దర్శకులకు చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం టాలీవుడ్ లో మల్టీస్టారర్లు ఎక్కువగా వస్తున్న తరుణంలో రవితేజ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ప్రస్తుతం రవితేజ, చిరు- బాబీ కాంబోలో తెరకెక్కుతున్న మెగా 154 లో కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ పాత్రకు మాస్ మహారాజా బాగానే పారితోషికం తీసుకున్నట్లు సమాచారం. మరి ఇతర హీరోల సినిమాల్లో నటించడానికి ఈ హీరో ఎంత ఛార్జ్ చేస్తాడో చూడాలి.