లారా దత్తా ఒక దశాబ్దం క్రితం హిందీ చిత్రసీమలో అతిపెద్ద తారలలో ఒకరు. ఆమె ఇప్పుడు బాలీవుడ్ సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ చేస్తున్నారు. తాజాగా ఈ బ్యూటీ డేటింగ్ యాప్‌ని ఉపయోగిస్తున్నట్లు వార్తలు వైరల్ కావడంతో గత రెండు రోజులుగా లారా వార్తల్లో నిలుస్తోంది. ఆమె యాప్‌ని ఉపయోగిస్తున్నట్లుగా వచ్చిన మీమ్స్ కూడా కొద్దిసేపటికే వైరల్‌గా మారాయి. లారాకు మెసేజ్‌లు వెల్లువెత్తడంతో ఆమె ఆన్‌లైన్‌కి వచ్చి వార్తలపై క్లారిటీ ఇచ్చింది. తాను ఏ డేటింగ్ యాప్‌లో లేనని, తన ఫోటో ఉన్న ప్రొఫైల్ నకిలీదని చెప్పింది.
Read also : పద్మశ్రీ అవార్డు ఎఫెక్ట్… కంగనాపై ట్రోలింగ్
ఈ 43 ఏళ్ల నటి ఇన్స్టాగ్రామ్ వీడియోలో డేటింగ్ యాప్ గురించి క్లారిటీ ఇస్తూ “నిన్నటి నుండి నా పేజ్ కొన్ని మీమ్స్ తో పాటు మెసేజ్‌లతో నిండిపోయింది. వారంతా నాకు ఒక రకమైన డేటింగ్ యాప్‌లో ప్రొఫైల్ ఉందని చెబుతున్నారు. కానీ నిజం ఏమిటంటే నేను ఏ డేటింగ్ యాప్‌లో లేను. ఇప్పుడే కాదు ఎప్పుడూ అలాంటి యాప్ లను వాడలేదు. డేటింగ్ యాప్‌లకు నేను వ్యతిరేకం కాదు. ప్రజలు ఒకరినొకరు కనెక్ట్ చేసుకోవడానికి, కలుసుకోవడానికి ఇది ఒక అద్భుతమైన మార్గం అని నేను భావిస్తున్నాను. కానీ నేను వ్యక్తిగతంగా ప్రస్తుతం డేటింగ్ యాప్‌లో లేను. ఈ రోజు ఇక్కడ ఉన్న మీ అందరితో కనెక్ట్ అవ్వడం చాలా సరదాగా ఉంది” అని చెప్పుకొచ్చింది.