Laila: సెట్ లో అందరి ముందు ఆ పని చేశా.. చివరకు ఆయన కాళ్లు పట్టుకొని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Laila: నటి లైలా గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ముగ్ద మనోహరమైన రూపం ఆమె సొంతం. ఎంతో అందంగా.. ముద్దుగా తెలుగింటి ఆడపడుచులా ఉండే ఈ భామ.. ఎగిరే పావురమా అనే సినిమాతో తెలుతెరకు పరిచయమై కుర్రాళ్ళ గుండెల్లో పావురంలా ఎగిరిపోకుండా తిష్టవేసుకుని కూర్చుండిపోయింది. ఇక ఈ సినిమా తరువాత బాలకృష్ణ, వెంకటేష్ లాంటి స్టార్ హీరోలతో నటించి మెప్పించింది. ఇక్కడే కాకుండా తమిళ్ లో సూర్య, అజిత్, విజయ్ లతో కలిసి నటించి స్టార్ హీరోయిన్ గా మారింది. ఇక కెరీర్ పీక్స్ లు ఉన్న సమయంలోనే ఒక బిజినెస్ మ్యాన్ ను వివాహం చేసుకొని ఇండస్ట్రీకి దూరమైంది. అప్పుడు అంటే సోషల్ మీడియా, ఇలా బ్రాడ్ మైండ్ మైండ్ లేదు తరువాత కూడా నటించలేకపోయారు చాలామంది హీరోయిన్లు. ఇక ఇప్పడు చిత్రపరిశ్రమ అందరిని అక్కున చేర్చుకోవడంతో అప్పటి భామలు ఇప్పుడు రీఎంట్రీలు ఇస్తూ మంచి అవకాశాలను అందుకుంటున్నారు. లైలా కూడా అలాగే రీ ఎంట్రీ ఇచ్చింది. జబర్దస్త్ లాంటి షోస్ కు వచ్చి అభిమానుల దృష్టిలో పడ్డ లైలా.. సర్దార్ లాంటి స్టార్ హీరో సినిమాలో చేసి హిట్ అందుకుంది. ఇక ప్రస్తుతం శబ్దం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ఒక యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన జీవితంలో మర్చిపోలేని సంఘటన ఒకటి చెప్పుకొచ్చింది.
తమిళ్ లో లైలాకు జాతీయ అవార్డును తెచ్చిపెట్టిన సినిమా నందా. సూర్య హీరోగా నటించిన ఈ సినిమాకు బాలా దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో ఆమె నటన బాగాలేదని.. బాలా నిత్యం కోప్పడేవారట. సరిగ్గా నటించమని, హావభావాలు మంచిగా పెట్టమని చెప్పేవారట. ఇక చాలారోజులు బాలా కోపాన్ని ఓర్చుకున్న లైలా ఒకరోజు సెట్ లోనే అందరి ముందు అరిచేసిందంట.. ” నేను ఈ సినిమా చేయను.. ఎప్పుడు నామీద అరుస్తూనే ఉంటారు.. నేను వెళ్ళిపోతాను అని అందరిముందు అరిచా.. వెంటనే అక్కడ ఉన్నవారు వచ్చి బాలా గారి గురించి ఎంతో బాగా చెప్పారు. ఆయన డైరెక్షన్ లో నటిస్తే మంచి పేరు, గుర్తింపు వస్తాయని, బాలా గారు చాలా మంచి మనిషి అని చెప్పుకొచ్చారు. ఇక సినిమా రిలీజ్ అయ్యాక మొదటిరోజు థియేటర్ కు వెళ్లి.. నన్ను నేను తెరపై చూసుకొని నేనే షాక్ అయ్యాను. అక్కడ వాళ్ళందరూ.. నన్ను చూసి చప్పట్లు కొట్టి.. అరుస్తూ ఈలలు వేయడం చూసి షాక్ అయ్యాను. వెంటనే బాలాగారి దగ్గరకు వెళ్లి ఆయన కాళ్ళు పట్టుకొని క్షమించమని అడిగాను” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
Also Read
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
తాజావార్తలు
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
MS Dhoni: ఐపీఎల్ బెట్టింగ్ కేసు.. ఎంఎస్ ధోనీకి హైకోర్టు నోటీసులు!
-
Shreyas Iyer: “ఆ ఇద్దరి వల్లే మ్యాచ్ ఓడిపోయాం”.. కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు..
-
Saturday Horoscope: శనివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
-
CJP Protest: ఢిల్లీలో హై అలర్ట్.. ఇంటర్నెట్ బంద్, మెట్రో స్టేషన్ల మూసివేత.. రంగంలోకి 35,000 మంది భద్రతా సిబ్బంది
ట్రెండింగ్
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!