Kumari Aunty to Enter Bigg Boss Telugu 8 Show: కుమారి ఆంటీ గురించి తెలుగు ప్రేక్షకులకు, ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దాసరి సాయి కుమారి అంటే చాలా మందికి తెలియకపోవచ్చు కానీ కుమారి ఆంటీ అనగానే ఆమెను ఇట్టే గుర్తుపడతారు. సుమారు 13 ఏళ్ల నుంచి హైదరాబాద్ రోడ్ సైడ్ మీల్స్ బిజినెస్ చేస్తుంది ఆమె. సోషల్ మీడియా పుణ్యమా అని ఆమెకు ఈ ఏడాది మొదట్లో మంచి క్రేజ్ వచ్చింది. సోషల్ మీడియాలో ఆమె క్రేజ్ చూసి ఆమె వంట రుచి చూసేందుకు వందల మంది కుమారి అండ్ స్ట్రీట్ ఫుడ్ స్టాల్ వద్దకు క్యూ కట్టడంతో ట్రాఫిక్ పోలీసులు ఆమె బిజినెస్ కూడా ఒకరోజు ఆపేశారు. చివరికి ఏకంగా రేవంత్ రెడ్డి కల్పించుకొని ఆమె బిజినెస్ కి ఎలాంటి అడ్డంకులు లేకుండా చూసుకోమని ఆదేశాలు జారీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక ఈ దెబ్బతో ఆమెను కొన్ని టీవీ ఛానల్స్ తమ సీరియల్స్, ప్రోగ్రామ్స్ లో కూడా ఎంట్రీ ఇప్పించి క్రేజ్ ను బాగానే క్యాష్ చేసుకున్నారు.
Suresh Gopi: ఇందిరాగాంధీని ‘భారతమాత’గా అభివర్ణించిన కేంద్రమంత్రి..
ఆ సంగతి అలా ఉంచితే ఆమెను సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో హైప్ చేస్తున్న సమయంలో ఏదో ఒక రోజు ఆమెను బిగ్ బాస్ లోకి పంపించే వరకు ఆగేలా లేరని కూడా ట్రోల్స్ నడిచాయి. ఇప్పుడు ఆ ట్రోల్స్ ఏ నిజం అయ్యాయి. ఆమెను ఈ సీజన్ తెలుగు బిగ్ బాస్ లోకి తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. మరి కొన్ని నెలల్లో ఈ సీజన్ మొదలైపోతున్న ఈ సీజన్ కోసం ఇప్పటికే వెతుకులాట ప్రారంభించింది బిగ్ బాస్ టీమ్. ఈ నేపథ్యంలో కుమారి ఆంటీని బిగ్ బాస్ కి రావాలని ఆహ్వానం పంపినట్టుగా చెబుతున్నారు. అయితే ఇంకా ఆమె ఫైనల్ డెసిషన్ చెప్పలేదని ప్రచారం జరుగుతోంది. గతంలో కూడా సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉన్నవారిని బిగ్ బాస్ లోకి ప్రచారం జరిగింది కానీ సీజన్ మొదలయ్యాక వాళ్ళు హౌస్ లో కనిపించేవారు కాదు. మరి కుమారి ఆంటీ విషయం ఏమవుతుందో కాలమే నిర్ణయించాలి.