Kumari Aunty about Bigg Boss Entry: హైదరాబాద్ దుర్గం చెరువు దగ్గరలో ఉన్న ఐటీసీ కోహినూర్ హోటల్ ఎదురుగా ఉన్న స్ట్రీట్ ఫుడ్ స్టాల్స్ లో ఒక స్టాల్ నడిపే దాసరి సాయి కుమారి కుమారి ఆంటీగా సోషల్ మీడియాలో విపరీతంగా ఫేమస్ అయిపోయింది. ఆమె స్టాల్ దగ్గరికి యూట్యూబ్ ఛానల్స్, మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానల్స్ కూడా క్యూ కడుతున్నాయి అంటే ఆమె క్రేజ్ సోషల్ మీడియాలో ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆమెకు అంత క్రేజ్ రావడంతో ఆమెను బిగ్ బాస్ లోకి తీసుకుంటారని కూడా సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది.
Upasana Konidela: చరణ్ కు, నాకు మధ్య చాలా హద్దులు ఉన్నాయి..
ఇదే విషయాన్ని ఒక యూట్యూబ్ ఛానల్ ప్రతినిధులు ఆమె ముందు ఉంచారు. మిమ్మల్ని బిగ్ బాస్ లోకి తీసుకోవాలని కూడా అడుగుతున్నారు చాలామంది దానిపై మీ అభిప్రాయం ఏమిటి అని ఆమెను అడిగితే బిగ్ బాస్ అంటే ఏమిటి అది ఏమైనా వంటల ప్రోగ్రామా అని ఆమె ప్రశ్నించడం హాట్ టాపిక్ అయింది. ఖాళీగా ఉండే యూత్ కి లేదా మీడియాకి బిగ్ బాస్ మీద అవగాహన ఉంటుంది కానీ ఉదయం లేస్తే తన పని తాను చూసుకునే దాసరి సాయి కుమారి లాంటి వాళ్లకి బిగ్ బాస్ తో పనేం ఉంటుంది? టైం పాస్ చేయడానికి చూసేవారికి ఇలాంటి బిగ్ బాస్ షోలు కావాలి కానీ. మొత్తం మీద ఆ ప్రశ్న అడిగిన వారెవరో తెలియదు కానీ వారికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చే విధంగా కుమార్ ఆంటీ సమాధానం ఉంది. ఈ విషయంలో మీ ఉద్దేశం ఏంటో కామెంట్ చేయండి.