Hrithik Roshan: బాలీవుడ్ క్రిటిక్ ను అని చెప్పుకొస్తూ స్టార్ లందరి మీద సంచలన వ్యాఖ్యలు చేసి నెటిజన్ల చేత తిట్టించుకోవడం కమల్ ఆర్ ఖాన్ కు అలవాటు గా మారిపోయింది. సినిమా బావున్నా, బాలేకున్నా ఈయన మాత్రం తనకు నచ్చినట్లు చెప్పి ప్రేక్షకులకు విరక్తి వచ్చేలా చెప్పి విసిగిస్తూ ఉంటాడు. ఇక సినిమా రివ్యూలు పక్కన పెడితే స్టార్ హీరోల పర్సనల్ విషయాలు, హీరోయిన్ల ప్రెగ్నెన్సీ విషయాలను సోషల్ మీడియాలో అందరిముందు మాట్లాడి వారి అభిమానుల చేత తిట్టించుకొంటూ ఉంటాడు. ఇక తాజాగా హృతిక్ రోషన్ పై కెఆర్కే సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇటీవల హృతిక్, సైఫ్ అలీఖాన్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన చిత్రం విక్రమ్ వేద. ఈ సినిమా టీజర్ ను ఇటీవలే మేకర్స్ రిలీజ్ చేశారు. ఇక ఈ ట్రైలర్ గురించి కమల్ రివ్యూ ఇస్తూ ఒక షాకింగ్ నిజాన్ని బయటపెట్టాడు.
“హృతిక్ ఎందుకు నువ్వు అబద్దాలు చెప్తున్నావ్.. ఎప్పుడు అబద్దాలు ఆపుతావ్. ఇప్పుడైనా నిజాలు మాట్లాడాలి. కంగనా రనౌత్ కు, హృతిక్ కు మధ్య జరిగిన స్టోరీ నాకు తెలిసినట్లు అందరికి తెలియాలి. ఒకరోజు హృతిక్.. నాకు అతని ల్యాప్ టాప్ లో కంగనా ప్రైవేట్ ఫోటోలను చూపించాడు. అవి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. వాటి గురించి తర్వాత మాట్లాడతాను. దానికి కూడా సరైన సమయం వస్తుంది అనుకుంటున్నాను” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం కమల్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. కంగనా ప్రైవేట్ ఫోటోలు హృతిక్ ల్యాప్ టాప్ లో ఎందుకు ఉన్నాయి. ఆ ఫోటోలు ఎవరు పంపారు..? దీని గురించి కంగనాకు తెలియదా..? అంటూ నెటిజన్లు ఆరా తీయడం మొదలుపెట్టారు. మరి ఈ విషయమై కంగనా, హృతిక్ ఎలా స్పీడిస్తారో చూడాలి.