Kriti Sanon: వన్ నేనొక్కొడినే సినిమాతో తెలుగుతెరకు పరిచయమైంది కృతి సనన్. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయినా అమ్మడికి మాత్రం మంచి గుర్తింపుని తీసుకొచ్చి పెట్టింది. ఈ సినిమా తరువాత నాగ చైతన్యతో కలిసి దోచేయ్ సినిమాలో నటించింది. ఈ సినిమా కూడా ఆశించిన ఫలితాన్ని అందించకపోయేసరికి ముద్దుగుమ్మ టాలీవుడ్ కు బై బై చెప్పింది. ఇక చాలా గ్యాప్ తరువాత ఈ భామ ప్రభాస్ సరసన ఆదిపురుష్ సినిమాలో నటించింది. ఈ చిత్రంలో సీతమ్మ గా కృతి నటన ఆకట్టుకున్నా.. ఈ సినిమా కూడా కృతికి విజయాన్ని అందించలేకపోయింది. ఇక సినిమా ఏమో కానీ, అమ్మడు ప్రభాస్ తో ప్రేమాయణం నడుపుతుందని, ప్రభాస్ ను పెళ్ళాడేది ఈమె అని వార్తలు గుప్పుమన్నాయి.
Allu Arjun: బ్రేకింగ్.. నేషనల్ అవార్డు అందుకున్న బన్నీ
ఇక అప్పటినుంచి ప్రభాస్ ఫ్యాన్స్.. కృతిని వదినమ్మ గా ఫిక్స్ అయ్యారు. అయితే అందులో ఎలాంటి నిజం లేదని.. ప్రభాస్ చాలాసార్లు క్లారిటీ ఇచ్చారు. ఇక ఈ విషయాలను పక్కన పెడితే.. ప్రస్తుతం కృతి కన్ను అల్లు అర్జున్ మీద పడింది అని అభిమానులు చెప్పుకొస్తున్నారు. నేడు ఢిల్లీలో జాతీయ అవార్డుల వేడుక ఘనంగా జరిగిన విషయం తెల్సిందే. ఇక ఈ వేడుకలో బన్నీ, కృతిసనన్ పక్క పక్కనే కూర్చొన్నారు. వీరిద్దరూ కలిసి ముచ్చటించుకున్నారు. ఇక దీంతో కృతిసనన్ కన్ను బన్నీపై పడిందే. నెక్స్ట్ సినిమా.. బన్నీతో చేయడానికి ప్లాన్ చేస్తుందని చెప్పుకొస్తున్నారు. మరి బన్నీతో ఈ పాప ఎలాంటి సినిమా చేస్తుందో లేదో చూడాలి.