NTV Telugu Site icon

The Warriorr : విజిల్ మహాలక్ష్మిగా కృతి శెట్టి… ఫస్ట్ లుక్

The-Warrior

ఎన్ లింగుసామి దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ “ది వారియర్”. రామ్ తొలిసారిగా లింగుసామి దర్శకత్వంలో నటిస్తున్నాడు. అంతేకాకుండా ఇది ఆయన మొదటి ద్విభాషా చిత్రం. ఈ చిత్రంతోనే రామ్ కోలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే.. వాలెంటైన్స్ డే స్పెషల్‌గా ఈ సినిమా నుంచి హీరోయిన్ కృతిశెట్టి ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. పోస్టర్‌లో కృతి శెట్టి ఒక ట్రెండీగా కూల్ లుక్ లో షర్ట్, జీన్స్ ధరించి స్కూటర్ నడుపుతోంది. ఆమె పాత్ర పేరు విజిల్ మహాలక్ష్మి అని మేకర్స్ ఈ పోస్టర్ ద్వారా వెల్లడించారు.

Read Also : Valentines Day : ఆర్జీవీ ప్రేమ పాఠాలు… అడ్వైజ్ ఏమిటంటే ?

లింగుసామి యాక్షన్ ఎంటర్‌టైనర్‌ లో పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే “ది వారియర్” నుంచి విడుదలైన హీరో ఫస్ట్ లుక్ సినిమాపై అంచనాలను పెంచింది. ఈ చిత్రంలో అక్షర గౌడ కీలక పాత్రలో నటిస్తుండగా, ఆది పినిశెట్టి విలన్‌గా నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. కమర్షియల్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌కి సంబంధించిన కొత్త షెడ్యూల్ ఇటీవలే ప్రారంభమైంది.