NTV Telugu Site icon

Krishna Vamsi: హనుమాన్ కన్నా శ్రీ ఆంజనేయం బెటర్.. కృష్ణవంశీ ఏమన్నాడంటే..?

Hanu

Hanu

Krishna Vamsi: ఇప్పుడంటే డైరెక్టర్ కృష్ణవంశీ అంటే చాలామంది కుర్రకారుకు తెలియదు కానీ, ఒకప్పుడు ఆయన తీసిన సినిమాలు, ఆయన టేకింగ్ కు ప్రేక్షకులే కాదు ఇండస్ట్రీ కూడా ఫిదా అయిపోయింది అంటే అతిశయోక్తి కాదు. ఒక సింధూరం, ఒక ఖడ్గం, ఒక నిన్నే పెళ్లాడతా.. ఇలా చెప్పుకుంటూపోతే కృష్ణవంశీ దర్శకత్వంలో ఎన్నో హిట్ సినిమాలు ఉన్నాయి. అయితే గతకొంతకాలంగా కృష్ణవంశీ ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నాడు. ఈ మధ్యనే రంగమార్తాండ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ ను అందుకుంది. ఇకపోతే ఇప్పుడు హనుమాన్ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ, ఇదే కథను కృష్ణవంశీ.. అప్పట్లోనే శ్రీ ఆంజనేయం పేరుతో తెరకెక్కించాడు.

నితిన్, ఛార్మీ, అర్జున్ సర్జా నటించిన ఈ సినిమా 2004 లో రిలీజ్ అయ్యి భారీ పరాజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు హనుమాన్ సినిమాను వీక్షిణించిన ప్రేక్షకులు కొంతమంది తమకు హనుమాన్ కన్నా శ్రీ ఆంజనేయం నచ్చిందని, శ్రీ ఆంజనేయం ప్లాప్ అవ్వడానికి ఛార్మీ ఓవర్ యాక్షన్ కారణమని అభిమానులు చెప్పుకొస్తున్నారు. ఇక తాజాగా కృష్ణవంశీ ఈ ప్రశ్నలకు సమాధానం ఇచ్చాడు. హనుమాన్ కన్నా శ్రీ ఆంజనేయం బెటర్ అన్న నెటిజన్ కు కృష్ణవంశీ సమాధానమిస్తూ.. ” ఆడియన్స్ తప్పు చేయరు.. నచ్చలేదు అంటే రీచ్‌బులిటీలో పొరపాటు ఉంది సార్.. అందుకే ఆడియెన్స్‌ని నిందించకండి సార్.. కొన్ని పోర్షన్స్‌లో నేను తప్పు చేశాను” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.