Site icon NTV Telugu

AAGMC: ‘కొత్తకొత్తగా’ బేబమ్మతో రొమాన్స్ మూడ్ లోకి దిగిన సుధీర్

sudheer babu

sudheer babu

‘సమ్మోహనం’ ‘వి’ తర్వాత సుధీర్ – ఇంద్రగంటి కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ చిత్రం ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’. మైత్రీ మూవీ మేకర్స్ సహకారంతో బెంచ్ మార్క్ స్టూడియోస్ పతాకంపై గాజులపల్లె సుధీర్ బాబు సమర్పణలో బి మహేంద్రబాబు – కిరణ్ బళ్లపల్లి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా ఫస్ట్ సింగిల్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. కొత్తకొత్తగా అంటూ సాగే ఈ గీతం ప్రేక్షకులను ఆకట్టుకొంటుంది.

రామజోగయ్య శాస్త్రి ఈ సాంగ్ కి లిరిక్స్ అందించగా వివేక్ సాగర్ సంగీత సారథ్యంలో చైత్ర – అభయ్ కలిసి ఆలపించారు. సుధీర్- కృతి జంట మధ్య రొమాన్స్ చాలా ఫ్ర్ష్ గా కనిపించింది. డైరెక్టర్ అయిన సుధీర్. కృతితో సినిమా చేస్తూ మధ్యలో ప్రేమలో పడడం. కృతి కూడా సుధీర్ ని ఇష్టపడడం వీడియోలో కనిపించాయి. సినిమా నేపథ్యంలోనే ఇంద్రగంటి సమ్మోహనం కూడా తెరక్కించారు. తాజాగా ఈ సినిమా బ్యాక్ డ్రాప్ కూడా సినిమా నేపథ్యం ఉండడంతో ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. మరి ఈ చిత్రంతో సుధీర్- ఇంద్రగంటి హ్యాట్రిక్ హిట్ ని అందుకుంటారేమో చూడాలి.

Exit mobile version