యంగ్ హీరోయిన్ శ్రీజ నటించి స్వీయ దర్శకత్వంలో రూపొందించిన సాంగ్ ఆల్బమ్ “కొత్త కొత్తగా”. ఈ సాంగ్లో “దేవగుడి” మూవీ ఫేమ్ హీరో అభినవ్ శౌర్య హీరోగా నటించారు. ఈ పాటకు లిరిక్స్, సంగీతాన్ని అందించారు రఘురామ్. సింగర్ లిప్సిక పాడారు. కొత్త కొత్తగా సాంగ్ ఆల్బమ్ లాంఛ్ కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో శనివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో హీరోయిన్, ప్రొడ్యూసర్, డైరెక్టర్ శ్రీజ మాట్లాడుతూ నేను సీరియల్స్ లో నటించాను. నాకు నటన అంటే ప్యాషన్. రంగస్థలం సినిమాలో సమంత ఫ్రెండ్ క్యారెక్టర్ చేశా, ఆ తర్వాత మరికొన్ని మూవీస్ లోనూ నటించాను. టీవీ ఛానెల్స్ కోసం శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్, జూ లకటక షోస్ చేశాను. శ్రీజ మ్యూజిక్ ఛానెల్ లో మేము చేసిన సాంగ్స్ అన్నీ మంచి సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు కొత్త కొత్తగా సాంగ్ చేశాం. ఈ పాటను హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూట్ చేశాం. బడ్జెట్ ఎంతయ్యింది అనేది చూసుకోలేదు. ఈ సాంగ్ లో కొంత షూట్ మా ఇంట్లోనే చేశాం. కొత్త కొత్తగా సాంగ్ ను మీరంతా విని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా అన్నారు.