Kota Bommali PS: మా సినిమా ఏ రాజకీయ పార్టీకి మద్దతుగా ఉండదు అంటున్న డైరెక్టర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kota Bommali PS: జోహర్, అర్జున ఫాల్గుణ చిత్రాలతో దర్శకుడిగా తన ప్రతిభను నిరూపించుకున్న దర్శకుడు తేజ మార్ని. ఆయన దర్శకత్వలో తెరకెక్కిన తాజా చిత్రం కోట బొమ్మాళి పీఎస్. రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ లీడ్ రోల్స్‌లో నటించిన ఈ చిత్రంలో శ్రీకాంత్, వరలక్ష్మీ శరత్‌కుమార్‌లు కీలకపాత్రలు పోషించారు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌పై బన్నీ వాస్, విద్యా కొప్పినీడి నిర్మించారు. నవంబర్ 24న సినిమా విడుదలవుతున్సందర్భంగా దర్శకుడు తేజ మార్ని మీడియాతో ముచ్చటించారు.
కోట బొమ్మాళీ కథను తెలుగులో చెప్పాలని ఎందుకనిపించింది?
Also Read
- Vijay - Rashmika: "బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా" .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
- Vijay Deverakonda: క్యారెక్టర్ కోసం ఇంత రిస్కా? 'రణబాలి' సెట్లో చావు అంచుల దాకా వెళ్లిన విజయ్ దేవరకొండ!
- Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా 'ఆదర్శ కుటుంబం'పై ఇంత సైలెన్స్ ఏంటి?
- The Paradise OTT: సిల్వర్ స్క్రీన్‌పై 'ది ప్యారడైజ్'లో మిస్సయిన ఆ పాట.. నెట్‌ఫ్లిక్స్ కోసం శ్రీకాంత్ ఓదెల మాస్టర్ స్కెచ్!
కొన్ని మంచి కథలు అక్కడితో ఆగిపోకుండా, దానిని పరిధిని పెంచాలని, ఆ కథను మరింత మందికి రీచ్ అవ్వాలని చేసే ప్రయత్నమే సినిమా. కోట బొమ్మాళీ పీఎస్ కథను కూడా ఎలాగైనా చెప్పాలని గట్టిగా నమ్మాను. అలాంటి గొప్ప కథ ఇది. ముఖ్యంగా ఇందులో స్టిస్టమ్‌లో వున్న వాళ్లు సిస్టమ్‌కు బలైతే ఎలా వుంటుంది అనే కాన్సెప్ట్ నాకు జనాలకు చెప్పాలనిపించింది. నేడు వ్యవస్థలో జరుగుతున్న రియల్టీ ఇది. కోట బొమ్మాళీ అనే ఊరిలో ఉప ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో ఏం జరిగింది? అది ముగ్గురు పోలీస్ ఆఫీసర్ జీవితాలను ఎలా మార్చింది అనేది కథ
రీమేక్ కథను చెప్పడానికి కారణ ఏమిటి?
ఇది రీమేక్ అయినా కేవలం వర్జినల్ కథలోని సోల్ మాత్రమే తీసుకున్నాను. మిగతాది అంతా మన నేటివిటికి మన ఎమోషన్స్‌కు తగ్గట్టుగా మార్చుకున్నాం. థ్రిలింగ్‌గా వుండేలా, ప్రేక్షకులకు ఆసక్తి కలిగేలా ఓ థ్రిల్లర్‌లా మార్చాం. ముఖ్యంగా సెకండాఫ్ పూర్తిగా మార్చాం. ప్రతి ఒక్కరూ థియేటర్‌లో చూసి ఎక్స్‌పీరియన్స్ అవ్వాల్సిన సినిమా ఇది. కమింగ్ జనరేషన్‌కు రాజకీయాలు, ఓటువిలువ, సిస్టమ్‌లో సిట్చుయేషన్స్‌కు తగ్గట్టుగా ఎలా వుండాలి అనే విషయాలకు ఈ సినిమా ఓ రిఫరెన్స్‌గా ఉపయోగపడుతుంది.
ప్రచార చిత్రాలు చూస్తుంటే సన్నివేశాలు చాలా రియలిస్టిక్‌గా అనిపిస్తున్నాయి?
నా గత సినిమాలు కూడా అలాగే వుంటాయి. ఈ సినిమా కోసం కూడా ప్రతిది రియలిస్టిక్‌గా వుండాలని ఎంతో కష్టపడ్డాం. రిస్క్ తీసుకున్నాం. ఈ చిత్రం చూస్తున్నంత సేపు ఆడియన్స్ అందరూ కోట బొమ్మాళి అనే ఊరిలో వున్న ఫీలింగ్ కలుగుతుంది.
ప్రస్తుత రాజకీయాలకు, ఈసినిమా కథకు ఏమైనా సంబంధం వుంటుందా?
ప్రజెంట్ రాజకీయాలకు, ఈ సినిమాకు ఎటువంటి సంబంధం లేదు. కాకపోతే ఎన్నికల గురించి, ఓటు విలువ గురించి చర్చించాం. అయితే ఈసినిమాలో ఏ సన్నివేశం ఓ పార్టీకి మద్దతుగ వుండదు. సిస్టమ్, మనం ఎలా కరప్ట్ అయి వున్నాం. అనేది ఈ చిత్రంలో చెబుతున్నాం. ఈ సినిమాకు ఏ పొలిటికల్ ఎజెండా లేదు.
శ్రీకాంత్, వరలక్ష్మీ శరత్‌కుమార్ పాత్రలు ఎలా వుంటాయి?
ఇద్దరివి చాలా గొప్ప పాత్రలు. పోటా పోటీగా వుంటాయి. తప్పకుండా వాళ్ల పాత్రలు అందరికి నచ్చుతాయి.
ఈ సినిమా ద్వారా జనాల్లో మార్పు వస్తుందని అనుకుంటున్నారా?
నేను చెప్పాలనుకున్న కథలో నా భావాలను చెప్పాలని నేను ప్రయత్నిస్తాను. దీని ద్వారా మార్పు తీసుకరావలనేది నా లక్ష్యం కాదు. కాకపోతే మన ప్రయత్నం మనం చేయాలి. ఈ చిత్రంలో ఓటు విలువ చెప్పడానికి ప్రయత్నించాం.
లింగిలింగిడి సాంగ్‌కు వస్తున్న ఆదరణ చూస్తుంటే ఎలా అనిపిస్తుంది?
ఈ సినిమాలో శ్రీకాకుళం ఫోక్ పెట్టాలని ఓ పెళ్లిలో విని ఈ సాంగ్‌ను పెట్టాం. ఈ పాటకు ఇంత ఆదరణ వస్తుందని ఊహించలేదు. ఈ పాట వలన మా సినిమా గురించి అందరికి తెలిసింది. పాట కూడా సినిమాలో సిట్యుయేషన్ పరంగా వుంటుంది.
భవిష్యత్‌లో మీ నుంచి ఎలాంటి సినిమాలు ఆశించవచ్చు?
నాకు అన్ని రకాల సినిమాలు చేయాలని వుంది. ఎమోషనల్ డ్రామాలు, మాస్ కథలు చెప్పాలని వుంది.
తాజావార్తలు
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
-
AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
-
Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!