Korean Kanakaraju: అనంతపురం నేలపై ‘కొరియన్ కనకరాజు’ సందడి.. చిరంజీవి స్టెప్పులే స్ఫూర్తి అన్న వరుణ్ తేజ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Korean Kanakaraju: యాక్షన్ సినిమాలు, కమర్షియల్ ఎంటర్టైనర్ల తర్వాత ఇప్పుడు మరో భిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘కొరియన్ కనకరాజు’ ఇప్పటికే టైటిల్‌తోనే బజ్ క్రియేట్ చేయగా, ఇప్పుడు ప్రమోషన్స్ కూడా అదే స్థాయిలో సాగుతున్నాయి. సాధారణంగా హైదరాబాద్ లేదా ఇతర ప్రధాన నగరాల్లో జరిగే ప్రచార కార్యక్రమాలకు భిన్నంగా, ఈ సినిమా యూనిట్ నేరుగా కథ పుట్టిన నేల అనంతపురాన్ని వేదికగా ఎంచుకోవడం విశేషంగా మారింది. సినిమాలోని జానపద శైలిలో రూపొందిన ‘రాస గుమ్మడి’ పాట విడుదల కార్యక్రమాన్ని అనంతపురంలో నిర్వహించడం విశేషంగా మారింది.
ఈ కార్యక్రమంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, దర్శకుడు మీర్లపాక గాంధీ, నిర్మాత రాజీవ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మీర్లపాక గాంధీ మాట్లాడుతూ, సినిమా కథ మొత్తం అనంతపురం, దాని పరిసర ప్రాంతాల నేపథ్యంలో సాగుతుందని చెప్పారు. కథకు అనుగుణంగా అనంతపురం లొకేషన్లలోనే షూటింగ్ నిర్వహించడం తప్పనిసరి అయిందని వెల్లడించారు. తాను స్వయంగా తిరుపతికి చెందిన వ్యక్తినని, రాయలసీమ సంస్కృతి తనకు ఎప్పుడూ ఎంతో దగ్గరగా ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు. ఆ ప్రాంతపు యాస , సంస్కృతిని వరుణ్ తేజ్ ఎంతో అంకితభావంతో అలవర్చుకోవడం తనను ఆశ్చర్యపరిచిందని ప్రశంసించారు.
Also Read
- Nani: నా కెరీర్లోనే అత్యంత కష్టమైన సినిమా ఇదే.. జడల బరువుపై నాని సంచలన వ్యాఖ్యలు!
- Nani: మా డైరెక్టర్ ఎవరినీ కొట్టలేదు.. నాని కీలక వ్యాఖ్యలు
- The Paradise: ట్రైలర్ లేకుండానే థియేటర్లలోకి నాని ‘ది ప్యారడైజ్’!
- Hanuman Ansh: త్రివిక్రమ్ చేతుల మీదుగా తెలుగులోకి 'హనుమాన్ అంశ్' - సెప్టెంబర్ 18న గ్రాండ్ రిలీజ్!
సినిమా కోసం వరుణ్ తేజ్ ప్రత్యేకంగా అనంతపురం యాసను నేర్చుకోవడంతో పాటు, స్థానికుల మాదిరిగా మాట్లాడేందుకు బాగా కష్టపడి శిక్షణ తీసుకున్నారని దర్శకుడు తెలిపారు. ప్రేక్షకులు ఇప్పటివరకు చూసింది ‘రాస గుమ్మడి’ పాట మాత్రమేనని, సినిమాలో వరుణ్ చెప్పే డైలాగులు, యాక్షన్ సన్నివేశాలు, రాయలసీమ నేపథ్యంలోని ఎమోషన్స్ మరింత ఆకట్టుకుంటాయని ఆయన అన్నారు. ముఖ్యంగా వరుణ్ తేజ్, నటుడు సత్య మధ్య వచ్చే కామెడీ ట్రాక్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుందని, హీరోయిన్ రితికా తెరపై కనిపించే ప్రతి సన్నివేశం కథకు ప్రత్యేకతను తీసుకొస్తుందని చెప్పారు.
ఈ సినిమాకు ‘కొరియన్’ అనే పేరు రావడానికి కూడా ఆసక్తికరమైన నేపథ్యం ఉందని చిత్రబృందం తెలిపింది. అనంతపురంలో ఉన్న కియా తయారీ ప్లాంట్, ఆ ప్రాంతానికి ఏర్పడిన కొరియా అనుబంధం కథలో కీలకంగా ఉంటుందని, అదే సినిమా కాన్సెప్ట్‌కు కొత్తదనాన్ని తీసుకొచ్చిందని వెల్లడించారు. .
ఈ సందర్భంగా మాట్లాడిన వరుణ్ తేజ్, సినిమా ప్రమోషన్స్‌ను అనంతపురం నుంచే ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందన్నారు. కథకు జీవం పోసిన నేల ఇదేనని, అందుకే ఈ ప్రాంతంలోనే తొలి ప్రచార కార్యక్రమం నిర్వహించాలని నిర్మాతలు నిర్ణయించారని తెలిపారు. సినిమా కథలో ఉన్న ఎమోషన్ ను ప్రేక్షకులకు మరింత దగ్గర చేయడానికి ఇదే సరైన వేదికగా భావించామని చెప్పారు.
అలాగే ‘రాస గుమ్మడి’ పాటలోని డ్యాన్స్ గురించి మాట్లాడిన వరుణ్ తేజ్, తాను ఎంతగానో అభిమానించే పెద్దనాన్న మెగాస్టార్ చిరంజీవి నుంచి తాను ఎంతో స్ఫూర్తి పొందానని వెల్లడించారు. ఆ పాటలో కనిపించే ఎనర్జీని చిరంజీవి శైలి వచ్చేలా ప్రయత్నించానని అన్నారు. ప్రస్తుతం తన కాలికి గాయం ఉండటంతో అభిమానుల ముందే స్టేజ్‌పై డ్యాన్స్ చేయలేకపోయానని, గాయం పూర్తిగా నయమై ఉంటే తప్పకుండా వారితో కలిసి స్టెప్పులు వేసేవాడినని చెప్పి అభిమానులను అలరించారు.
భిన్నమైన టైటిల్, రాయలసీమ నేపథ్యంలో సాగే కథ, ప్రశాంతమైన గ్రామీణ వాతావరణాన్ని ప్రతిబింబించే విజువల్స్, స్థానిక యాస, జానపద సంగీతం, కొత్త తరహా వినోదంతో వస్తున్న ‘కొరియన్ కనకరాజు’ ఇప్పుడు ప్రేక్షకుల్లో మంచి అంచనాలను సృష్టిస్తోంది. విడుదలకు ముందు నుంచే ప్రచారంలో ప్రత్యేకతను చాటుకుంటున్న ఈ సినిమా థియేటర్లలో ఎలాంటి స్పందన అందుకుంటుందో చూడాల్సి ఉంది.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్‌లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?