Korean Kanakaraju Teaser: పెనుకొండ నుంచి కొరియా వరకు.. ‘కొరియన్ కనకరాజు’ టీజర్ చూశారా!

Korean Kanakaraju Teaser

Korean Kanakaraju Teaser

Korean Kanakaraju Teaser:మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం ‘కొరియన్ కనకరాజు’ (KOKA). ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా ఈ సినిమా టీజర్‌ను పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రిలీజ్ చేశారు. తాజాగా రిలీజ్ అయిన ఈ టీజర్‌‌ మంచి స్పందనను సొంతం చేసుకుంటోంది. పెనుకొండ నుంచి కొరియా వరకు సాగే స్టోరీతో తెరకెక్కిన ఈ చిత్రంలో వరుణ్ తేజ్ పాత్రను మేకర్స్ వినూత్నంగా ఆవిష్కరించినట్లు టీజర్‌ను బట్టి తెలుస్తోంది. ఈ చిత్రానికి మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. వినోదంతో పాటు యాక్షన్, ఎమోషన్‌లను మేళవిస్తూ రూపొందించిన ఈ సినిమాలో హీరోయిన్‌గా రితికా నాయక్ నటిస్తోంది.

ఈ సినిమాకు సంగీత దర్శకుడు ఎస్.తమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ టీజర్‌కు మరింత హైలైట్‌గా నిలిచింది. టీజర్‌లో కనిపించిన విజువల్స్, వరుణ్ తేజ్ మేకోవర్, కొరియా బ్యాక్‌డ్రాప్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్, యూవీ క్రియేషన్స్, టీ-సిరీస్ సౌత్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇక ‘కొరియన్ కనకరాజు’ ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 7 న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు వస్తున్న స్పందనతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.