NTV Telugu Site icon

NTR 30: ఎన్టీఆర్ సినిమాకు మ్యూజిక్ ప్రారంభం.. అనిరుధ్‌ మాస్ బీట్స్ షురూ

Ntr 30

Ntr 30

NTR 30: ఆర్.ఆర్.ఆర్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ మూవీలో నటిస్తున్నాడు. ఎన్టీఆర్ కెరీర్‌లో ఈ మూవీ 30వ సినిమాగా తెరకెక్కుతోంది. దీంతో ఈ సినిమాకు ఎన్టీఆర్ 30 అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు. ఇప్పటికే ఎన్టీఆర్ ఈ మూవీ కోసం మేకోవర్ అయ్యాడు. పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీని నందమూరి కళ్యాణ్‌రామ్ ఆర్ట్స్ పతాకంపై కళ్యాణ్‌రామ్ నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి తమిళ సంగీత దర్శకుడు అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. తాజాగా అనిరుధ్‌తో దర్శకుడు కొరటాల శివ సమావేశమై చర్చలు జరుపుతున్నాడు. ఈ మూవీకి అనిరుధ్ మాస్ బీట్స్‌కు ఎన్టీఆర్ తన స్టెప్పులతో దుమ్మురేపడం ఖాయమని నందమూరి అభిమానులు విశ్వసిస్తున్నారు.

Read Also: PSLV-54: శనివారం నింగిలోకి పీఎస్ఎల్వీ-54.. ఓషన్‌శాట్-3 శాటిలైట్ ప్రయోగం

అనిరుధ్ గతంలో తెలుగులో రెండు, మూడు సినిమాలకు మాత్రమే సంగీతం ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి, నాని జెర్సీ, గ్యాంగ్ లీడర్ వంటి సినిమాలకు మ్యూజిక్ సమకూర్చాడు. తాజాగా ఎన్టీఆర్ సినిమా అతడికి మంచి అవకాశం అనే చెప్పాలి. ఈ మూవీతో అనిరుధ్ టాలీవుడ్‌పై తనదైన ముద్ర వేయాలని భావిస్తున్నాడు. త్వరలో ఎన్టీఆర్ 30 మూవీ సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ ప్రాజెక్ట్ విషయంలో ఇటీవల హైడ్రామా నడిచింది. ఒక దశలో ఆగిపోయినట్లు పుకార్లు వినిపించాయి. ఆచార్య సినిమా ఫ్లాప్‌తో ఎన్టీఆర్ ఈ చిత్రంలో నటించేందుకు ఆసక్తి చూపలేదంటూ టాక్ వినిపించింది. అయితే కొరటాల శివ ప్రీ ప్రొడక్షన్‌లో పాల్గొంటున్న ఫోటోలు బయటకు రావడంతో ఈ మూవీపై క్లారిటీ వచ్చింది.