NTV Telugu Site icon

Koratala Shiva: అల్లు అర్జున్ సినిమా పై అంచనాలు పెంచేసాడే..

Bunny

Bunny

టాలీవుడ్ లో అపజయం ఎరుగని దర్శకుల్లో కొరటాల శివ ఒకరు. అటు క్లాస్ ప్రేక్షకులను, ఇటు మాస్ ఆడియెన్స్ ను ఒకే దగ్గర కలిపి కూర్చోపెట్టగల సత్తా చూపించిన దర్శకుడు ప్రస్తుతం చిరంజీవి తో ఆచార్య సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 29 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ప్రొమొతిఒన్స్ లో పాల్గొన్న కొరటాల తన తదుపరి చిత్రాల హీరోల గురించి చెప్పుకొచ్చాడు.  ఆచార్య తరువాత ఈ డైరెక్టర్ ఎన్టీఆర్ తో ఒక సినిమా చేస్తుండగా.. దాని తరవాత అల్లు అర్జున్ తో ఒక సినిమా చేయనున్నాడు.

ఇప్పటికే ఎన్టీఆర్ మూవీ స్క్రిప్ట్ వర్క్ పూర్తిచేసినట్లు చెప్పిన కొరటాల.. అల్లు అర్జున్ సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. ” నేను అభిమానులకు ప్రామిస్ చేసినట్లే అల్లు అర్జున్ కోసం మంచి కథను సిద్ధం చేస్తాను. ఆ కథ ఎలా ఉంటుంది అంటే మునుపెన్నడు అల్లు అర్జున్ ను మీరెవ్వరు అలా చూడరు. ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తాను..  బన్నీని భారీ  స్థాయిలో చూపించడానికి ప్రయత్నిస్తాను” అని చెప్పుకొచ్చాడు. దీంతో ఇప్పటినుంచే ఈ కాంబోపై అభిమానులు భారీ అంచనాలను పెట్టేసుకుంటున్నారు. మరి ఈ కాంబో ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్లనుందో చూడాలి.