Site icon NTV Telugu

Pawan Kalyan: చరణ్ కు బాబాయ్ మీద అంత ప్రేమ.. కూతురుకు పవన్ పేరు కలిసేలా పెట్టాడు

Pawan

Pawan

Pawan Kalyan: మెగా వారసుడుగా చిరుత సినిమాతో తెలుగుతెరకు పరిచయమయ్యాడు రామ్ చరణ్. విజయాపజయాలను పట్టించుకోకుండా కష్టపడే తత్వాన్ని తండ్రినుంచి.. ఎన్ని విజయాలు వచ్చినా పొంగిపోకుండా ఒదిగే ఉండే తత్వాన్ని బాబాయ్ నుంచి నేర్చుకొని మెగా పవర్ స్టార్ నుంచి గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు. చరణ్ కు తన తండ్రి అంటే ఎంత ప్రేమ, అభిమానమో.. బాబాయ్ పవన్ కళ్యాణ్ అన్నా కూడా అంతే అభిమానం. చరణ్ చిన్నతనంలో చిరుకన్నా ఎక్కువ పవన్ వద్దే పెరిగాడు అని అందరికి తెల్సిందే. పవన్ బాబాయ్ అంటే తనకు చాలా ఇష్టమని చరణ్ ఎన్నోసార్లు చెప్పుకొచ్చాడు. ఇక ఆ ఇష్టంతోనే పవన్ పేరునే కూతురుకు పెట్టాడు అని కొంతమంది అభిమానులు నెట్టింట చర్చించుకుంటున్నారు. రామ్ చరణ్ – ఉపాసన దంపతులు 11 ఏళ్ళ తరువాత ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెల్సిందే. నేడు పాప బారసాల వేడుక ఉపాసన తల్లిగారింట గ్రాండ్ గా జరిగింది. ఇక మెగా ప్రిన్సెస్ పేరు.. “క్లిన్ కారా కొణిదెల” గా ప్రకటించారు. షార్ట్ కట్ లో “KKK”.

Captain Miller: ఫ్రీడమ్ కు గౌరవమివ్వమంటున్న ధనుష్

ఇక ఈ పేరుకు పవన్ పేరుతో సంబంధం ఏంటి అంటే.. పవన్ అసలు పేరు.. కళ్యాణ్ కుమార్ కొణిదెల.. ‘KKK’. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి… సినిమా సమయంలో ఆయనను కళ్యాణ్ బాబు అని పిలిచేవారు. ఆ సినిమా తరువాత కళ్యాణ్ బాబు కాస్తా పవన్ కళ్యాణ్ గా మారాడు. ఇక పవన్ ను ఒరిజినల్ పేరుతోనే చరణ్ కూతురుకు ఆ పేరు పెట్టాడు అని అభిమానులు చెప్పుకొస్తున్నారు. ఇక కళ్యాణ్ బాబు పేరు కె. కళ్యాణ్ కుమార్. ఆయన మొదట్లో అన్న నాగబాబుతో కలిసి చిరు సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించినట్లు చాలా తక్కువమందికి తెలుసు. చిరు నటించిన రుద్రవీణ సినిమాకు నాగబాబు నిర్మాత కాగా, పవన్ సహా నిర్మాతగా వ్యవహరించాడట. ఆ టైటిల్ లో కూడా సహా నిర్మాత కె . కళ్యాణ్ కుమార్ అని ఉంటుంది. దీంతో చిన్నతాత పేరు కూడా మెగా ప్రిన్సెస్ పేరులో కలిసేలా పెట్టారని అభిమానులు చర్చించుకుంటున్నారు. ఒకవేళ అది కాకపోయినా క్లిన్ కారా.. చిన్న తాత పేరు అలా కలిసివచ్చింది అని కూడా చెప్పొచ్చు. ఏదిఏమైనా ఈ పోలిక బాగుందని అభిమానులు అంటున్నారు.

Exit mobile version