NTV Telugu Site icon

Konaseema Thugs : తగ్గేదే లే అంటున్న మైత్రీ మూవీ మేకర్స్!

Konaseema

Konaseema

Mythri Movie Distributors: ఈ యేడాది ఇప్పటికే తన ప్రొడక్షన్ హౌస్ నుండి మూడు చిత్రాలను రిలీజ్ చేసింది మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ. అందులో ‘వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య’ చిత్రాలు ఘన విజయం సాధించాయి. మూడో చిత్రం ‘అమిగోస్’ మాత్రం ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది. ఇటీవలే పంపిణీ రంగంలోకి కూడా అడుగుపెట్టిన మైత్రీ మూవీమేకర్స్ సంస్థ తాజాగా ”కోనసీమ థగ్స్’ మూవీ తెలుగు రైట్స్ సొంతం చేసుకుంది. ఈ మూవీని ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో 24వ తేదీ గ్రాండ్ గా రిలీజ్ చేయబోతోంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఈ నెల 19న గ్రాండ్ గా ప్లాన్ చేస్తోంది.

ప్రముఖ కొరియోగ్రాఫర్ బృందా గోపాల్ ‘కోనసీమ థగ్స్’ మూవీని తెరకెక్కించారు. దర్శకురాలిగా ఇది ఆమెకు రెండో సినిమా. గత యేడాది ‘హే సినామికా’తో బృందా దర్శకురాలిగా తొలిసారి మెగా ఫోన్ చేతిలోకి తీసుకున్నారు. తాజా చిత్రం ‘కోనసీమ థగ్స్’ను ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ శిబు తమీన్స్ కుమార్తె రియా షిబు హెచ్ ఆర్ పిక్చర్స్ బ్యానర్ పై సమర్పిస్తూ జీయో స్టూడియోస్ తో కలిసి నిర్మిస్తున్నారు. తమీన్స్ కుమారుడు హ్రిదు హరూన్ హీరోగా పరిచయం అవుతుండగా సింహ, ఆర్ కె సురేష్, మునిష్కంత్, శరత్ అప్పనీ, అనస్వర రాజన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీ భాషలలోనూ విడుదల కాబోతోంది.

Show comments