ఈ నెలలో ఇప్పటి వరకూ దాదాపు ఇరవై చిత్రాలు విడుదల కాగా, ఈ వారాంతంలో కేవలం మూడు సినిమాలే జనం ముందుకు రాబోతున్నాయి. అందులో రెండు స్ట్రయిట్ మూవీస్ కాగా ఒకటి అనువాద చిత్రం.
ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ పంపిణీరంగంలోనూ తన సత్తా చాటుతోంది. ఈ నెల 24న రాబోతున్న 'కోనసీమ థగ్స్' మూవీని ఇదే సంస్థ రెండు తెలుగు రాష్ట్రాలలో పంపిణీ చేయబోతోంది.