కొంత మంది యాక్టర్స్ మూవీలో సైడ్ క్యారెక్టర్ అయిన ప్రేక్షకుల్లో మంచి అట్రాక్షన్‌గా మిగిలిపోతారు అలాంటి వారిలో కోమలి ఒకరు. నాని హీరోగా వచ్చిన హిట్ 3లో వర్ష పాత్రలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతకు ముందు కూడా పలు చిత్రాల్లో నటించినప్పటికీ హిట్ మూవీతో తనకు మరింత ఫేమ్ వచ్చింది. పోలీస్ పాత్రలో స్ఫూర్తిదాయకంగా నటించడం ద్వారా ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే కొమలి ప్రసాద్. ఇటీవల ఒక నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు.
Also Read : Jailer 2 : జైలర్ 2’లో బాలీవుడ్ హాట్ బ్యూటీ..?
“హిట్ ఫ్రాంచైజీలో సహాయక నటిగా కనిపించినందుకు బాధ పడకండి. పోలీస్‌గా నటించే అవకాశం చాలా తక్కువ మందికి వస్తుంది. మీరు ఆ పాత్రలో బాగా నటించారు’ అని కామెంట్ పెట్టాగా..దానికి స్పందిస్తూ, కోమలి ప్రసాద్ మాట్లాడుతూ, ఆ సినిమాలో నటించినందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు. అలాగే.. “ఒక స్టార్ హీరోతో పోలీస్ పాత్రలో నటించడం ఒక పెద్ద అవకాశం. ఇది చాలా అరుదుగా వస్తుంది. హిట్ ఫ్రాంచైజీ ద్వారా నేను అనేక మంది ప్రేక్షకుల హృదయాలకు చేరువయ్యాను. ఈ పాత్ర నాకు విభిన్నమైన పాత్రలో నటించే ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. అలాగే, కిల్ బిల్ లాంటి పూర్తి స్థాయి యాక్షన్ చిత్రాల్లో నటించాలని కోరిక కలిగింది” అని తెలిపింది. అంటే తనకు ఎలాంటి పాత్రలు కావాలో హింట్ ఇస్తున్నట్లుగా క్లియర్ గా తెలుస్తోంది. కాగా ఈ హిట్ ఫ్రాంచైజీ లోని అన్ని సినిమాలు పెద్ద విజయాన్ని సాధించాయి. 2020లో విశ్వక్ సేన్ తో మొదలైన ఈ ఫ్రాంచైజీ, ఆ తర్వాత అడివి శేష్, నాని లతో రెండో, మూడవ భాగాలను విడుదల చేసింది. ఈ అన్ని భాగాల్లో కొమలి ప్రసాద్ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.