గత కొంత కాలంగా అనారోగ్య సమస్యల కారణంగా ఇబ్బంది పడుతున్నాడు కోలీవుడ్ వెటరన్ స్టార్ హీరో విజయకాంత్. ది కెప్టెన్ అంటూ అభిమానులు పిలుచుకునే విజయకాంత్ కి 80-90ల్లో సూపర్ స్టార్ స్థాయి ఇమేజ్ ఉండేది. యాక్షన్ సినిమాలని ఎక్కువగా చేసే విజయకాంత్ రాజకీయాల్లో కూడా చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. సినిమాలు, రాజకీయాలని బాలన్స్ చేసుకుంటూ తన అభిమానులకి ఎప్పుడూ దగ్గరగానే ఉన్న వియజయకాంత్ అనారోగ్య సమస్యల కారణంగా గతకొంతకాలంగా హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యి ఉన్నారు. ఇటీవలే డిశ్చార్జ్ అయిన విజయకాంత్ కరోనా సోకడంతో మళ్లీ హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యారు. కరోనా చికిత్స పొందుతూ విజయకాంత్ మరణించారని MIOT ఇంటర్నేషనల్ హాస్పిటల్ వర్గాలు వెల్లడించాయి. డీఎండీకే అధినేత విజయకాంత్, తమ అభిమాన హీరో ‘ది కెప్టెన్’ మరణించాడు అనే వార్త బయటకి రావడంతో తమిళనాడు మొత్తం శోకసంద్రంలో మునిగింది. గత కొన్నేళ్లుగా మృత్వుతో పోరాడుతున్న కెప్టెన్ ఈరోజు తుదిశ్వాస విడిచారని విజయకాంత్ అభిమానులు చింతిస్తున్నారు.
Read Also: Vijayakanth: కోలీవుడ్ సీనియర్ నటుడు విజయకాంత్ కుడికాలి మూడు వేళ్ల తొలగింపు