Shiva Karthikeyan: మూడో సారి వంద కోట్లు కొల్లగొట్టనున్న యంగ్ హీరో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ యంగ్ స్టార్ హీరో శివకార్తికేయన్ కి తమిళనాడులో సూపర్బ్ ఫాలోయింగ్ ఉంది, మోస్ట్ ఎమర్జింగ్ హీరోగా పేరు తెచ్చుకున్న శివ కార్తికేయన్ స్టార్ హీరోలకి కూడా పోటీ ఇచ్చే స్థాయికి ఎదుగుతున్నాడు. తెలుగులో నాని అంతటి పేరు తెచ్చుకున్న ఈ హీరో ‘డాక్టర్’, ‘డాన్’ సినిమాలతో రెండు బ్యాక్ టు బ్యాక్ వంద కోట్ల సినిమాలని ఇచ్చాడు. ఈ మూవీస్ తో కోలీవుడ్ లో శివ కార్తికేయన్ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. శివ కార్తికేయన్ నుంచి సినిమా వస్తుంది అంటే చాలు పక్కా హిట్ పడుతుంది అనే నమ్మకం అందరిలోనూ ఉంది. ఇలాంటి సమయంలో అనుదీప్ కేవీతో ప్రిన్స్ సినిమా చేసిన శివ కార్తికేయన్ బయ్యర్స్ కి హ్యూజ్ లాస్ ని మిగిలించాడు. అంతకముందు భారి లాభాలని ఇచ్చిన హీరో, ప్రిన్స్ సినిమాతో కనీసం బ్రేక్ ఈవెన్ మార్క్ ని కూడా టచ్ చెయ్యలేకపోయాడు. దీంతో శివ కార్తికేయన్ పై ట్రేడ్ వర్గాలు, సినీ అభిమానులు పెట్టుకున్న నమ్మకానికి కాస్త ఇబ్బంది కలిగింది.
ఫ్లాప్ ఇవ్వడం అనేది ఏ హీరోకైనా మాములే కానీ నేను సోల్డ్ కంబ్యాక్ ఇస్తాను, నా పైన పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతాను అంటూ శివ కార్తికేయన్ ఈసారి ‘మావీరన్’ సినిమాతో ఆడియన్స్ ముందుకి వచ్చాడు. జులై 14న రిలీజ్ అయిన ఈ మూవీని మడోన్ అశ్విన్ డైరెక్ట్ చేసాడు. కొత్త కథ, అంతే కొత్త కథనం మావీరన్ సినిమాని హిట్ చేసాయి. మొదటి రోజు మార్నింగ్ షో నుంచే హిట్ టాక్ స్ప్రెడ్ అవ్వడంతో శివ కార్తీకేయన్ కంబ్యాక్ ఇచ్చేసాడని కోలీవుడ్ మీడియా అనౌన్స్ చేసేసింది. మూడు రోజుల్లో 45 కోట్లు రాబట్టిన మావీరన్ సినిమా తెలుగులో మహావీరుడుగా రిలీజ్ అయ్యి, ఇక్కడ కూడా హిట్ టాక్ సొంతం చేసుకుంది. బేబీ సినిమా వల్ల మహావీరుడు కలెక్షన్స్ ఆశించిన స్థాయిలో లేవు కానీ తమిళనాడు బాక్సాఫీస్ దగ్గర మాత్రం మావీరన్ హవా కొనసాగుతూనే ఉంది. సెకండ్ వీక్ ఎండ్ అయ్యే టైంకి శివ కార్తికేయన్ ఖాతాలో మూడో వంద కోట్ల సినిమా ఉంటుందని ట్రేడ్ వర్గాలు ప్రిడిక్ట్ చేస్తున్నాడు. ఇదే జరిగితే శివ కార్తికేయన్ టయర్ 2 నుంచి టాప్ హీరోల రేస్ లోకి వచ్చేసినట్లే అవుతుంది.
Also Read
- Toxic : వంద కోట్ల గ్రాస్ కూడా రాబట్టలేక షాకిచ్చిన 'యశ్ టాక్సిక్'
- Gandhari vs Toxic: ‘గాంధారి’ని చూసి నేర్చుకోవాలి.. ‘టాక్సిక్’ హీరోయిన్స్ పై నెటిజన్స్ కౌంటర్లు ..
- NBK 111 : ఫ్యామిలీ మెంబర్స్, డాక్టర్స్ మాట బాలయ్య వినడం లేదా?
- Celebrity Marriage: తమ్ముడితో హీరోయిన్గా నటించి.. అన్నను పెళ్లాడిన భామలు వీరే! ఈ లిస్ట్‌లో ఎవరెవరు ఉన్నారంటే?
తాజావార్తలు
-
Toxic : వంద కోట్ల గ్రాస్ కూడా రాబట్టలేక షాకిచ్చిన ‘యశ్ టాక్సిక్’
-
Times Square Stabbing: న్యూయార్క్‌లో కత్తితో మహిళ వీరంగం.. ఇద్దరిపై దాడి, పోలీస్ ఫైరింగ్‌లో హతం!
-
Kranti Goud: నెం.11 స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి చరిత్ర సృష్టించిన క్రాంతి గౌడ్..!
-
Gandhari vs Toxic: ‘గాంధారి’ని చూసి నేర్చుకోవాలి.. ‘టాక్సిక్’ హీరోయిన్స్ పై నెటిజన్స్ కౌంటర్లు ..
-
NBK 111 : ఫ్యామిలీ మెంబర్స్, డాక్టర్స్ మాట బాలయ్య వినడం లేదా?
ట్రెండింగ్
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!