Site icon NTV Telugu

Suriya: అందుకే సామీ.. నిన్ను దేవుడు అనేది..

Surya

Surya

Suriya: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమిళ్ అభిమానులే కాదు తెలుగు అభిమానులకు కూడా సూర్య అంటే ప్రాణమని చెప్పాలి. సినిమాల పరంగా కాకుండా వ్యక్తిగతంగా కూడా ఆయనను అభిమానించేవారు ఉన్నారు. ఎవరికైన కష్టం వస్తే మొదట నిలబడడం, మహిళలకు గౌరవం ఇవ్వడం, చిన్న పిల్లలను, అనాధ పిల్లలను చదివించడం.. ఇలా సూర్య చేసే మంచి పనులే ఆయనను అందరికి దగ్గర చేసాయి. ఒక తమిళ్ హీరోను తెలుగు ప్రేక్షకులు ఎంతగా ఓన్ చేసుకున్నారు అంటే.. ఆయన పుట్టినరోజుకు కటౌట్స్ పెట్టి.. పాలాభిషేకాలు, పూలాభిషేకాలు చేయడం మొదలుపెట్టారు. ఈ ఏడాది సూర్య పుట్టినరోజున ఆయన కటౌట్స్ పెట్టబోయి ఇద్దరు కుర్రాళ్ళు కరెంట్ షాక్ కొట్టి మృతిచెందిన విషయం తెల్సిందే. ఆ విషయం తెలియడంతో సూర్య వెంటనే స్పందించి యువకుల కుటుంబాలకు అండగా ఉంటాను అని చెప్పి అందరి మన్ననలు అందుకున్నాడు.

Kiran Abbavaram: హీరో గృహప్రవేశం.. పూలు కడుతూ కనిపించిన హీరోయిన్..

ఇక తాజాగా తన అభిమాని రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడని తెలుసుకొని అతని ఇంటికి వెళ్లి .. వారి కుటుంబాన్ని పరామర్శించాడు. చెన్నైలోని ఎన్నూర్‌లో నివసించే అరవింద్‌ అనే యువకుడు సూర్యకు వీరాభిమాని. సూర్య ఫ్యాన్స్‌ క్లబ్‌లో కొన్నేళ్లుగా మెంబర్‌ కూడా పని చేశాడు. ఇక ఇటీవల అరవింద్.. ఒక రోడ్డు ప్రమాదంలో కన్నుమూశాడు. ఈ విషయం తెలియడంతో సూర్య .. అరవింద్ ఇంటికి వెళ్లి అతని తల్లిదండ్రులను పరామర్శించాడు. అరవింద్ లేని లోటును తాను తీరుస్తానని, వారికి ఎటువంటి సహాయం కావాలన్నా అడగొచ్చు అని దైర్యం చెప్పాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఈ ఫోటోలు చూసిన అభిమానులు.. అందుకే సామీ.. నిన్ను దేవుడు అనేది.. అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇకపోతే ప్రస్తుతం సూర్య కంగువ అనే చిత్రంలో నటిస్తున్నాడు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో సూర్య ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Exit mobile version