Kiran Abbavaram: హీరో గృహప్రవేశం.. పూలు కడుతూ కనిపించిన హీరోయిన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kiran Abbavaram: రాజావారు రాణిగారు చిత్రంతో తెలుగుతెరకు పరిచయమయిన హీరో కిరణ్ అబ్బవరం. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న కిరణ్.. ఆ తరువాత విజయాపజయాలను పక్కన పెట్టి వరుస సినిమాలను చేస్తూ బిజీగా మారాడు. ఇక కిరణ్ పై ఎన్ని విమర్శలు వచ్చినా కూడా పట్టించుకోకుండా కష్టపడుతున్నాడు. ఇక వినరో భాగ్యం విష్ణుకథ అనే సినిమాతో మంచి హిట్ అందుకున్న కిరణ్.. ప్రస్తుతం రూల్స్ రంజన్ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఎప్పటినుంచో కిరణ్.. ఒక సొంతిల్లు కట్టుకోవాలని ఆశపడుతున్నాడు. తాజాగా ఆ ఆశను కుర్ర హీరో నెరవేర్చుకున్నాడు. సొంత ఊరిలో ఒక సొంత ఇల్లును కట్టి గృహప్రవేశం కూడా గ్రాండ్ గా జరిపించాడు. అందుకు సంబంధించిన వీడియోను కిరణ్ అభిమానులతో షేర్ చేసుకున్నాడు.
Salaar: సలార్ బ్లాక్ బస్టర్ హిట్.. కెజిఎఫ్ కు మించి ఉంది.. థియేటర్ లో అరుపులే
Also Read
- Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
- Vijay - Trisha: దళపతి విజయ్ అలా ఎందుకు చేశాడు? పాపం త్రిష! వీడియో వైరల్..
- Dhruv Vikram: మైత్రీ అడ్డాలోకి చియాన్ తనయుడు.. ధ్రువ్ విక్రమ్ ‘జాకీ’ అనౌన్స్మెంట్ చూశారా!
- Upasana Konidela: ‘‘చరణ్ పక్కన నువ్వేం సెట్ అవుతావ్ అన్నారు..’’ బాడీ షేమింగ్, ట్రోల్స్‌పై ఉపాసన రియాక్షన్!
ఇక ఈ వీడియోలో కిరణ్ తో పాటు తన రూమర్డ్ గర్ల్ ఫ్రెండ్ కూడా ఉండడం హాట్ టాపిక్ గా మారింది. కిరణ్, హీరోయిన్ రహస్య గోరఖ్ ప్రేమలో ఉన్నట్లు ఎప్పటినుంచో వార్తలు వస్తున్న విషయం తెల్సిందే. వీరిద్దరూ కలిసి ఎన్నోసార్లు బయట కనిపించారు. రాజావారు రాణిగారు చిత్ర సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ మొదలయ్యిందని తెలుస్తోంది. ఇక తాజాగా కిరణ్ ఇంటి గృహప్రవేశం వేడుకలో ఈ చిన్నది మెరిసింది. కుటుంబ సభ్యులతో కలిసి పూలు కడుతూ కనిపించింది. దీంతో వీరి ప్రేమ వ్యవహారం పెళ్లి వరకు వచ్చిందని, కిరణ్ కుటుంబ సబ్యులకు కూడా రహస్య నచ్చిందని అభిమానులు చెప్పుకొస్తున్నారు. త్వరలోనే ఈ జంట పెళ్లి పీటలు ఎక్కనున్నారని వార్తలు వస్తున్నాయి. ఎలాగూ ఇల్లు కూడా కట్టేశావ్.. తరువాత పెళ్లియేగా చేసేసుకో బ్రో అని అభిమానులు చెప్పుకొస్తున్నారు. మరి ఈ విషయమై ఈ జంట ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
తాజావార్తలు
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
-
Ind Vs Afg: ఆఫ్ఘనిస్థాన్‌తో తొలి టీ20 మ్యాచ్.. అద్భుత పోరాటం చేసిన ఒమర్జాయ్..
-
Best Investment Scheme: పథకం చిన్నదే.. కానీ కోటీశ్వరులను చేస్తుంది.. 18 ఏళ్లు నిండిన వారు అర్హులు..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!