కోలీవుడ్ లో రజినీకాంత్-విజయ్ ఫ్యాన్స్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే అంత వార్ జరుగుతోంది. గత కొన్నేళ్లుగా రజినీకాంత్ ని విజయ్ బాక్సాఫీస్ దగ్గర దాటేశాడు అంటూ విజయ్ ఫ్యాన్స్ అంటుంటే… ఒక్క ఇండస్ట్రీ హిట్ లేకుండా విజయ్ సూపర్ స్టార్ ఇమేజ్ ఎలా సొంతం చేసుకుంటాడు అంటూ రజినీ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ సమయంలో విజయ్ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టడం… రజినీకాంత్ ఫ్లాప్స్ ఇవ్వడంతో రజినీ పని అయిపొయింది, ఇక విజయ్ టైమ్ వచ్చేసింది అనే కామెంట్స్ వినిపించడం మొదలయ్యింది. రజినీ టైమ్ అయిపొయింది అన్న ప్రతి ఒక్కరినీ సైలెంట్ చేసింది జైలర్ సినిమా. యావరేజ్ సినిమాతో రజినీ క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంత కాదు. నెల్సన్ డైరెక్ట్ చేసిన జైలర్ సినిమా రజినీ సాలిడ్ కంబ్యాక్ ఇచ్చేలా చేసింది. కోలీవుడ్ ఇండస్ట్రీ హిట్స్ లో ఫస్ట్ ప్లేస్ లో రోబో 2.0 ఉంటే ఇప్పుడు సెకండ్ ప్లేస్ లో జైలర్ వచ్చి చేరింది. విక్రమ్, పొన్నియిన్ సెల్వన్ లాంటి పాన్ ఇండియా సినిమాల కలెక్షన్స్ ని కూడా జైలర్ తో రజినీ చెల్లాచెదురు చేసాడు.
ఇక రజినీకాంత్ కి తిరుగులేదు అనుకుంటున్న సమయంలో లియో సినిమాతో విజయ్-లోకేష్ కనగరాజ్ తో కలిసి వచ్చాడు. లోకేష్ మార్కెట్, విజయ్ మార్కెట్ కలిస్తే పాన్ ఇండియా హిట్ గ్యారెంటీ అనుకున్నారు అంత. అయితే లియో సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు మార్నింగ్ షో నుంచే నెగటివ్ అండ్ యావరేజ్ టాక్ ని సొంతం చేసుకోని ఆడియన్స్ కి ఊహించని షాక్ ఇచ్చింది. టాక్ బాగోలేకున్నా లియో సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్స్ నే రాబట్టింది. లియో మూవీ ఓపెనింగ్స్ చూసి… ఇది కచ్చితంగా జైలర్ కలెక్షన్స్ ని బ్రేక్ చేస్తుంది అంటూ ఇండస్ట్రీ వర్గాలు, విజయ్ ఫ్యాన్స్ కామెంట్స్ చేసారు కానీ ఎండ్ ఆఫ్ ది డే… జైలర్ సినిమాని లియో బీట్ చేయలేకపోయింది. ఈ రెండు సినిమాల మధ్య 65-70 కోట్ల డిఫరెన్స్ ఉంది. మరి తన నెక్స్ట్ సినిమాతో అయినా విజయ్ రజినీకాంత్ రికార్డ్స్ ని బ్రేక్ చేస్తాడో లేదో చూడాలి.
