NTV Telugu Site icon

Klin Kaara: క్లీంకార పేరుకి ముందు, వెనుక ఎలాంటి ట్యాగుల‌ను ఇవ్వ‌కండి : ఉపాస‌న‌

Klin Kaara Konidela

Klin Kaara Konidela

Klin Kaara One Month Birth Anniversary: జూన్ 20 అనేది మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, ఉపాస‌న దంప‌తుల జీవితంలో మరచిపోలేని రోజు. అదే రోజు క్లీంకార పుట్టుక‌తో త‌ల్లిదండ్రులుగా జీవితంలో కొత్త అంకాన్ని ప్రారంభించారు. ఇక గురువారం నాడు ఉపాసన పుట్టినరోజు సంధర్భంగా క్లీంకార ఆగ‌మ‌నానికి సంబంధించిన హృద‌యానికి హ‌త్తుకునే అంద‌మైన వీడియోను సోషల్ మీడియాలో విడుద‌ల చేశారు. గురువారంతో పాప పుట్టి నెల రోజులు అవుతుండగా ఈ వీడియో విడుదల చేయడం గమనార్హం. క్లీంకార వన్ మంత్ బ‌ర్త్ యానివ‌ర్స‌రీ వీడియోను టాలెంటెడ్ ఫిల్మ్ మేక‌ర్‌ జోసెఫ్ ప్ర‌త‌నిక్ డైరెక్ట్ చేశారు. ఈ వీడియోలో లెజెండ్రీ యాక్ట‌ర్ మెగాస్టార్ చిరంజీవి, ఆయ‌న సతీమ‌ణి సురేఖా కొణిదెలతో పాటు ఉపాస‌న త‌ల్లిండ్రులు శోభా కామినేని, అనీల్ కామినేని సహా కుటుంబ స‌భ్యులంద‌రూ ఉన్నారు. అయితే ఆమె రాకతో అంద‌ద‌రిలోనూ ఎగ్జ‌యిట్‌మెంట్‌, ఆనందం ఉండ‌టాన్నిమ‌నం గ‌మ‌నించ‌వ‌చ్చు. క్లీంకార పుట్టిన త‌ర్వాత కుటుంబ స‌భ్యులు, అభిమానులు అంద‌రూ పండుగ చేసుకోగా వాట‌న్నింటినీ కూడా వీడియోలో అందంగా చూపించారు.

Gunasekhar: అన్యాయం జరిగితే మాత్రం వదిలే ప్రసక్తే లేదు. ఎంతవరకైనా వెళ్తా.. గుణశేఖర్ వార్నింగ్?

ఇక ఈ క్రమంలో మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ మాట్లాడుతూ “క్లీంకార పుట్టే స‌మ‌యంలో మా అంద‌రిలోనూ తెలియ‌ని టెన్ష‌న్‌ ఉందని, అంతా స‌రిగ్గా జ‌ర‌గాల‌ని మేం అంద‌రూ ప్రార్థిస్తున్నామని అన్నారు. అందుకు త‌గిన‌ట్టే అన్నీ అనుకూలంగా మారి స‌రైన స‌మ‌యం కుద‌ర‌టంతో పాప ఈ లోకంలోకి అడుగు పెట్టింద‌ని భావిస్తున్నాననన్న ఆయన పాప పుట్టిన ఆ క్ష‌ణం మ‌న‌సుకి ఆహ్లదంగా, చాలా సంతోషంగా అనిపించిందని, పాప పుట్ట‌టానికి ప‌ట్టిన 9 నెల‌ల స‌మ‌యం, అప్పుడు జ‌రిగిన ప్రాసెస్ అంతా త‌లుచుకుని హ్యాపీగా ఫీల‌య్యాం అని అన్నారు.
ఇక ఈ సంద‌ర్భంగా ఉపాస‌న కొణిదెల మాట్లాడుతూ “మా పాప ద్రావిడ సంస్కృతిలో భాగం కావాల‌ని నేను కోరుకున్నానని ఆమె పేరుకి ముందు, వెనుక ఎలాంటి ట్యాగుల‌ను ఇవ్వ‌కండి, అలాంటి వాటిని వారే స్వ‌యంగా సాధించుకోవాల‌ని నా అభిప్రాయం అని అన్నారు. పిల్ల‌ల పెంప‌కంలో ఇవెంతో ముఖ్య‌మైన‌వని పేర్కొన్న ఆమె జీవితంలో ప్ర‌తీ క్ష‌ణాన్ని ఆస్వాదించాలని అన్నారు. మ‌నం అంద‌రితో క‌లిసి సంతోషంగా ఉన్న స‌మ‌యానికి విలువ ఇవ్వాల‌ని నేను భావిస్తానని ఉపాస‌న అన్నారు.