Kismat Teaser: మరో మ్యాడ్ అయ్యేలా ఉందే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kismat Teaser: ఈ మధ్య ఫ్రెండ్ షిప్ స్టోరీలు బాగా వర్క్ అవుట్ అవుతున్నాయి. నలుగురు, ముగ్గురు ఫ్రెండ్స్.. వారి జీవితంలో జరిగిన సంఘటనలు ఆధారంగా దర్శకులు కథలు అల్లి.. ప్రేక్షకుల ముందుకు వదులుతున్నారు. కుర్రకారు.. వారిలో తమను తాము చూసుకుంటూ సినిమాలను హిట్ చేసేస్తున్నారు. ఈ మధ్య రిలీజ్ అయిన మ్యాడ్ సినిమా ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాలేజ్ బ్యాక్ డ్రాప్.. ముగ్గురు ఫ్రెండ్స్.. వారి లవ్ స్టోరీలు.. ఇలా సాగింది. డే 1 నుంచి కూడా ఈ సినిమా నుంచి పాజిటివ్ టాక్ అందుకొని మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఇలాంటి సినిమానే మరొకటి రెడీ అవుతుంది.. అదే కిస్మత్. నరేష్ అగస్త్య, అభినవ్ గోమఠం, విశ్వ దేవ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో అవసరాల శ్రీనివాస్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. కామ్రేడ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ, అథీరా ప్రొడక్షన్స్ సంయుక్తంగా శ్రీనాథ్ బాదినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రియా సుమన్ కథానాయికగా నటిసస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా టీజర్ ను హీరో శ్రీ విష్ణు రిలీజ్ చేసి బెస్ట్ విషెస్ చెప్పాడు.
Naveen Polishetty: మంచి ఆటగాళ్లు.. ట్రావెలర్ అన్వేష్ ను ఇమిటేట్ చేసిన నవీన్
Also Read
- Bloody Romeo : రోమియో పక్కన జూలియట్‌గా ప్రీతిముకుందన్?
- Aadarsha Kutumbam : 'ఆదర్శ కుటుంబం' మళ్లీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. బిగ్ ఫెయిల్యూర్ అయిన ముగ్గురు బడ్డీ దోస్తులు తమ జీవితంలో ఏదైనా అద్భుతం జరగాలని ఆశిస్తుంటారు. విశ్వ దేవ్ హోప్ కోల్పోయి ఉంటాడు, అభినవ్ గోమతం రచయితగా సినిమాల్లోకి ప్రవేశించాలని చూస్తుంటాడు, నరేష్ అగస్త్య రియా సుమన్‌తో ప్రేమలో ఉంటాడు. అనుకోని సంఘటనతో వారి కిస్మత్ (అదృష్టం) ఎలా మారిపోయిందన్నదే తెరపై చూడాలి. శ్రీనాథ్ బాదినేని యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌ను ఎంచుకున్నాడు, ఇందులో థ్రిల్లింగ్ అంశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా డైలాగులు యూత్‌ని బాగా ఆకట్టుకుంటాయి. నరేష్ అగస్త్య , అభినవ్ గోమఠం, విశ్వ దేవ్, శ్రీనివాస్ అవసరాల తమ టాప్ పెర్ఫార్మెన్స్ లతో ఆకట్టుకున్నారు. ఈ చిత్రానికి వేదరామన్ శంకరన్ సినిమాటోగ్రఫీ అందించారు. మార్క్ కె రాబిన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పెద్ద అసెట్. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రానికి విప్లవ్ నైషధం ఎడిటర్. కిస్మత్ నిర్మాతలు సినిమా విడుదల తేదీని త్వరలో అనౌన్స్ చేయనున్నట్లు తెలిపారు. మరి ఈ సినిమా.. మ్యాడ్ లా మరో హిట్ అవుతుందో లేదో చూడాలి.
తాజావార్తలు
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!