Site icon NTV Telugu

Kishkindhapuri : ‘కిష్కింధపురి’ గ్లింప్స్.. భయపెట్టబోతున్న బెల్లంకొండ

Sai Srinivas

Sai Srinivas

Kishkindhapuri : బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా వరుస సినిమాలు చేస్తున్నాడు. తాజాగా ఆయన నటిస్తున్న 11వ సినిమా కిష్‌కంధపురి. ఈ సారి హర్రర్ థ్రిల్లర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీని కౌశిక్ పెగల్లపాటి డైరెక్ట్ చేశారు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమాను సాహు గారపాటి నిర్మిస్తున్నారు. తాజాగా మూవీ ఫస్ట్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. ఈ మూవీని పూర్తి స్థాయి హర్రర్ థ్రిల్లర్ గా తెరకెక్కించారు. ఫస్ట్ గ్లింప్స్ లో ఓ పాడుబడ్డ ఇంటిలోకి హీరో శ్రీనివాస్ ఇంకొంత మంది వెళ్తున్నట్టు కనిపిస్తోంది. రెండు, మూడు సార్లు ఆ డోర్ తాళం పగలగొట్టేందుకు ప్రయత్నిస్తుంటే.. స్క్రీన్ మీద కొన్ని డోర్లను ముట్టుకోవద్దు అని వస్తుంది. ఆ తర్వాత వారంతా లోపలకు వెళ్తుంటే కొన్ని చోట్లకు వెళ్లొద్దు అని స్క్రీన్ మీద వస్తుంది.
Read Also : IPL 2025: గిల్ vs అయ్యర్.. క్రేజీ పోటీ మాములుగా లేదుగా!

ఆ తర్వాత డోర్లు క్లోజ్ అవుతుంటే.. కొన్ని శబ్దాలు వినపడకూడదదు అని స్క్రీన్ మీద మళ్లీ వస్తుంది. చివర్లో బెల్లంకొండ శ్రీనివాస్ ‘అహం మృత్యుమ్’ అంటూ చెప్పే డైలాగ్ తో ఎండ్ చేశారు. ఈ సినిమా చివర్లో చూస్తుంటే శ్రీనివాస్ కూడా దెయ్యం పట్టిన వ్యక్తిలాగా కనిపిస్తున్నాడు. అంటే హీరో కూడా దెయ్యంతోనే ఏదో లింక్ పెట్టుకున్నట్టు ఇందులో చూపిస్తున్నారు. మొత్తంగా సినిమా హర్రర్ థ్రిల్లర్ ను తలపిస్తోంది. ఈ గ్లింప్స్ లో కథ గురించి ఎలాంటి హింట్స్ ఇవ్వలేదు. కొన్ని విజువల్స్ ను మాత్రమే చూపించారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మొదటిసారి ఇలాంటి పాత్రలో నటిస్తున్నాడు. ఈ నడుమ హర్రర్ సినిమాలకు ఎక్కువ డిమాండ్ ఉండటంతో ఇందులో నటిస్తున్నట్టు తెలుస్తోంది.

Read Also : Roshan Meka: శ్రీకాంత్ కొడుకుతో రిస్క్ చేస్తున్న దత్ సిస్టర్స్?

Exit mobile version